కూరల్లో రుచే కాదండోయ్.. కొత్తిమీర ఆరోగ్యాన్నివ్వడంలో మేటి!

Samatha

24 july  2025

Credit: Instagram

కొత్తి మీర అంటే తెలియని వారు ఎవరుంటారు చెప్పండి. ఏ కర్రీ అయినా సరే మంచి టేస్ట్ రావాలి అంటే తప్పకుండా కొత్తి మీర ఉండాల్సిందే.

అయితే ఇది ఆహారపదార్థాలకు మంచి రుచిని ఇవ్వడమే కాదండయో.. ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా కీలకపాత్ర పోషిస్తుందంట.

కాగా, ఇప్పుడు మనం ప్రతి రోజూ వంటల్లో కొత్తిమీరను ఉపయోగించడం వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.

కొత్తిమీరలో కాల్షియం, కార్బోహైడ్రేట్, మినరల్స్, ఫైబర్, ఐరన్, పొటాషియం, విటమిన్ సి, కెరోటిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయంట.

అందువలన కొత్తిమీరను ప్రతి రోజూ వంటల్లో ఉపయోగించడం వలన జీర్ణసమస్యలు తగ్గుతాయంట. మరీ ముఖ్యంగా పచ్చి కొత్తిమీర తింటే ఆరోగ్యానికి చాలా మంచిదంట.

దీని వలన జీర్ణ క్రియ సాఫీగా సాగడమే కాకుండా మలబద్ధక సమస్య తగ్గుతుందంట. అలాగే షుగర్ లెవల్స్‌ను కూడా కంట్రోల్‌లో ఉంచుతుందంట.

కొత్తి మీర గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని ప్రతి రోజూ తీసుకోవడం వలన రక్తప్రసరణను పెంచి, గుండె పనితీరును మెరుగుపరుస్తుందంట.

అలాగే శరీరంలో పేరుకపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో, శరీరానికి తక్షణ శక్తి ఇవ్వడంలో కీలకంగా పనిచేస్తుందంట.