జోరు వానలు.. ఈ సమయంలో మందారం టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో!

18 September 2025

Samatha

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చాలా వర్షాలు కురుస్తున్నాయి. జోరు వానలకు ప్రజలు అల్లాడి పోతున్నారు. అయితే వర్షకాలంలో కొన్ని రకాల టీ తాగడం చాలా మంచిది.

ముఖ్యంగా వర్షాకాలంలో  మందార టీ తాగడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవిఏవో చూద్దాం.

మందరార టీలో అనేక పోషకాలు ఉంటాయి. అంతే కాకుండా దీనిని తాగడం వలన శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు.

వర్షకాలంలో మందార టీ తాగడం వలన రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా, బలంగా ఉంచడానికి సహాయపడుతుంది.

అలాగే వర్షకాలంలో మందార టీ తాగడం వలన రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా, శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.బరువు నియంత్రణలో ఉంచుతుంది.

మందారం టీలో ఉండే యాంటిస్పాస్మోడిక్ లక్షణాలు మలబద్ధకాన్ని తగ్గించి, జీర్ణవ్యవస్థను బలంగాఉంచుతాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

చర్మ ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. మందార టీ తాగడం వలన ఇది చర్మాన్ని హైడ్రేట్ చేసి చర్మం పొడిబారకుండా నిరోధిస్తుంది.

అదే విధంగా మందార టీ తాగడం వలన ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలు శరీరంలోని ఒత్తిడిని తగ్గించి, అలసటను కూడా తగ్గిస్తాయి.