మీ చర్మం మిల మిలా మెరిసిపోవాలా.. తప్పక తినాల్సిన ఫ్రూట్స్ ఇవే!

28 September 2025

Samatha

పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పక పండ్లు తినాలని చెబుతుంటారు.

అయితే పండ్లు ఆరోగ్యానికే కాదు, ముఖ సౌందర్యాన్ని పెంచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయంట. కొన్ని పండ్లు తినడం వలన ముఖం అందంగా మెరిసిపోతుందంట.

వృద్ధ్యాప్య ఛాయలు తగ్గిపోయి, మెరిసే చర్మం కోసం ఎలాంటి పండ్లు తినాలో ఇప్పుడు మనం చూద్దాం.

నారింజ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందువలన దీనిని ప్రతి రోజూ తింటే ఇది చర్మాన్ని కాంతి వంతంగా తయారు చేస్తుంది.

బొప్పాయి తినడం వలన ఆరోగ్యమే కాదు, అందం కూడా.. ఇందులో విటమిన్ ఎ, సి ఎక్కువగా ఉండటం వలన ఇది మఖంపై మచ్చలు తగ్గిస్తుంది.

మామిడి పండ్లు చర్మ ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని ఎక్కువగా తినడం వలన చర్మం మిల మిలా మెరిసిపోతుందంట.

కివిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందువలన దీనిని ప్రతి రోజూ తింటే చర్మం కాంతివంతంగా మారి, మొటిమలు, మచ్చలు తగ్గుతాయంట.

పుచ్చకాయలో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన దీనిని తినడం వలన శరీరం హైడ్రేట్ గా ఉంటి తాజా మెరుపునిస్తుందంట.