కిడ్నీ సమస్యలు రాకూడదా.. తప్పక తినాల్సిన ఫ్రూట్స్ ఇవే!

Samatha

21 August  2025

Credit: Instagram

మానవ శరీరంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి మన శరీరంలోని వ్యర్థాలు, టాక్సిన్స్ , అదనపు నీటిని ఫిల్టర్ చేస్తాయి.

అందుకే మంచి పోషకాలు కలిగిన ఆహారం తీసుకొని, కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవాలని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు.

కానీ కొంత మంది సరైన ఫుడ్ తీసుకోకుండా, కిడ్నీ సమస్యలను కొనితెచ్చుకుంటారు. కాగా, ఇప్పుడు మనం కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలో చూద్దాం

దానిమ్మ మూత్రపిండాలను డీటాక్స్ చేయడంలో కీలక పాత్రపోషిస్తుంది. ఇది శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపించే సామర్థ్యం కలిగిఉంటుంది.

బొప్పాయిలో ఫ్లేవనాయిడ్లు, విటమిన్ సి, పుష్కలంగా ఉండటం వలన ఇది మూత్రపిండాలు, కాలేయ ప్రమాదాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

కాన్బెర్రీస్ ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని ప్రతి రోజూ తినడం వలన రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా, కాలేయ, కిడ్నీల పనితీరును మెరుగుపడుతుంది.

నేరేడు పండ్లు  కిడ్నీ హెల్త్‌కు ఎంతో మంచిది. ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించి కిడ్నీలు, కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయి.

రెడ్ గ్రేప్స్‌లో యాంటీఆక్సిడెంట్స్, ఫ్లవనోయిడ్స్ ఉంటాయి. ఇవి కిడ్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. గుండె సమస్యలను తగ్గిస్తాయి.