రాత్రిపూట హాయిగా నిద్రపోవాలా.. అయితే ఇవి తినాల్సిందే!

Samatha

8 november 2025

నిద్ర ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే చాలా మంది కంటినిండా హాయిగా నిద్రపోవాలి అనుకుంటారు. కానీ  అందరూ హాయిగా నిద్రపోలేరు

కొంత మంది మాత్రమే హాయిగా నిద్రపోతారు. అయితే మీరు రాత్రి సమయంలో హాయిగా కంటి నిండా నిద్రపోవాలి అంటే తప్పకుండా ఇవి తినాలంట.

ఖర్జూరా  ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అయితే రాత్రి పడుకునే ముందు వీటిని తినడం వలన హాయిగా నిద్రపడుతుందంట.

అలాగే పుట్టగొడుగులు కూడా మంచి నిద్రను ప్రోత్సహిస్తాయి. ఇందులో మెలటోనిన్ ఎక్కవగా ఉండటం వలన ఇది మంచి నిద్రను ప్రేరేపిస్తుందంట.

రాత్రి పూట పాలు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే నిద్రలేమి సమస్యతో బాధపడే వారు రాత్రి పడుకునే ముందు గ్లాస్ పాలు తాగడం చాలా మంచిదంట.

బాదం పప్పులు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఇవి ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాకుండా,  మానసిక ప్రశాంతతను అందించి, త్వరగా నిద్రపట్టేలా చేస్తాయంట.

నిద్రలేమి సమస్యతో బాధపడే వారు కివీ తినడం కూడా ఆరోగ్యానికి మంచిది. ఇందులోవిటమిన్స్, రాగి, ఫొలెట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది

అంతే కాకుండా, రాత్రి సమయంలో వాల్ నట్స్, పిస్తా , జీడి పప్పు వంటివి తినడం వలన కూడా ఇందులో ఉండే మెలటోనిన్ మంచి నిద్రను ప్రోత్సహిస్తుందంట.