చలికాలం మొదలైంది బాబు.. మీ శరీరాన్ని ఇలా వెచ్చగా ఉంచుకోండి!
10 october 2025
Samatha
చలికాలం మొదలైపోయింది. తేలికపాటి చలి స్టార్ట్ అవ్వడంతో చాలా మంది ఇప్పటి నుంచే చలి నుంచి తమను రక్షించుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టేస్తున్నారు.
అయితే చలికాలంలో మీ శరీరం వెచ్చగా ఉండాలి అంటే, తప్పకుండా మంచి ఆహార పదార్థాలు తీసుకోవాలి. కాగా, శరీరాన్ని వెచ్చగా ఉంచే ఫుడ్ ఏదో ఇప్పుడు తెలుసుకుందాం.
చలికాలంలో ప్రతి రోజూ డ్రైఫ్రూట్స్ తినడం వలన అది శరీరాన్ని వెచ్చగా, ఆరోగ్యంగా ఉంచుతుందంట. అందుకే తప్పకుండా డ్రై ఫ్రూట్స్ తినాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.
చలికాలంలో బాదం తినడం వలన ఇందులో మెగ్నీషియం, ప్రోటీన్స్ పుష్కలంగా ఉండటం వలన, ఇది శరీరంలో వేడిని పెంచడానికి దోహద పడుతుంది, శరీరానికి శక్తిని అందిస్తుంది.
జీడిప్పులో మెగ్నీషియం, ఇనుముకు ఎక్కువ మోతాదులో ఉండటం వలన ఇది శరీరంలో వేడిని పెంచుతుంది. అలాగే రోగనిరోధక శక్తి పెరిగేలా చేస్తుందంట.
వాల్ నట్స్ లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అందువలన ఇవి శరీరానికి వెచ్చదనాన్ని అందిస్తాయి. అలాగే గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.
అంజీర్ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఫైబర్, పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అందువలన చలికాలంలో వీటిని తింటే శరీరం వెచ్చగా ఉంటుంది.
వేరుశెనగలు చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే వీటిని చలికాలంలో వేయించుకొని తినడం వలన ఇందులో ఉండే విటమిన్ ఇ, శరీరంలో వేడిని పెంచుతుందంట.