నిమ్మకాయతో అస్సలే తినకూడని ఆహార పదార్థాలు ఇవే! 

18 September 2025

Samatha

నిమ్మకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని ఆహారంలో తీసుకోవడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు.

అందుకే చాలా మంది వీటిని ఎక్కువగా తీసుకుంటారు. అయితే ఇది పుల్లగా ఉన్నప్పటికీ, వంటకాల రుచిని మాత్రం చాలా పెంచుతాయి. కానీ

అయితే రుచిని పెంచినా, వీటితో కలిపి కొన్ని రకాల ఆహారపదార్థాలు, పండ్లు తీసుకోకూడదంట. అవి ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

నిమ్మకాయతో పాటు పాల ఉత్పత్తులు అస్సలే తీసుకోకూడదు, దీని వలన జీర్ణ సమస్యలు, కడుపు నొప్పి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందట.

చింత పండు నిమ్మకాయ కలిపి అస్సలే తీసుకోకూడదు. ఎందుకంటే, దీని వలన తీవ్రమైన ఆమ్లత్వం ఏర్పడతుంది. ఇది అనారోగ్యకరం.

నిమ్మకాయతో గుడ్డు అస్సలే తినకూడదంట. ఎందుకంటే? ఎగ్‌లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. దీని వలన జీర్ణక్రియకు అంతరాయం కలిగే ఛాన్స్ ఉంటుందంట.

తియ్యటి పండ్లతో నిమ్మకాయ అస్సలే తినకూడదంట. దీని వలన కూడా గ్యాస్, ఎసిడిటీ, ఉబ్బరం వంటి సమస్యలు ఎక్కువ వచ్చే ప్రమాదం ఉన్నదంట.

అలాగే నిమ్మకాయ తిన్నతో పాటు ఐస్ క్రీమ్స్, స్వీట్స్ వంటివి ఎక్కువగా తీసుకోకూడదు, దీని వలన అనేక సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నదంట.