ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారు ప్రత్యేకంగా తీసుకోవాల్సిన ఫుడ్ ఇదే!

19 September 2025

Samatha

ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఫ్యాటీ లివర్ సమస్య ఒకటి. చాలా మంది ఈ సమస్యతో సతమతం అవుతున్నారు.

తీసుకుంటున్న ఆహారం, జీవనశైలి కారణం యువతలో ఈ సమస్య చాలా ఎక్కువైపోయింది. అయితే ఈ సమస్య ఉన్నవారు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంట.

కాలేయంలో కొవ్వుపేరుకపోవడం లన ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. అయితే దీనిని నివారించడానికి తప్పకుండా కొన్ని ఆహారాలు తీసుకోవాలంట.

బాదం పప్పులు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో మెగ్నీషియం, విటమిన్ ఇ, ఎక్కువగా ఉంటాయి. అందువలన ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారు బాదం తినడం మంచిది. కానీ మితంగా తీసుకోవాలంట.

బచ్చలికూరలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. అందువలన దీనిని మీ డైట్‌లో చేర్చుకుంటే సమస్యకు చెక్ పెట్టొచ్చు.

గుమ్మడి గింజలు ఆరోగ్యానికి చాలా మంచిది. అందువలన వీటిని ప్రతి రోజూ తీసుకోవడం వలన మీ లివర్ ఆరోగ్యంగా ఉంటుంది.

అవిసె గింజల్లో మెగ్నీషియం, ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్ , ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ లివర్ లోని కొవ్వును తగ్గిస్తాయి.