బీపీ సమస్యతో బాధపడుతున్నారా? అయితే మీ కోసమే ఈ అదిరిపోయే సమాచారం, బీపీ సమస్య ఉన్నవారు అస్సలే కొన్ని రకాల ఆహారాలు తీసుకోకూడదంట.
ప్రస్తుతం చాలా మంది బీపీ సమస్యతో బాధపడుతున్నారు. అయితే బీపీ ఉన్న వారు తప్పకుండా డైట్ ఫాలో అవ్వాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
బీపీ ఉన్న వారు ఎట్టిపరిస్థితుల్లోను ఉప్పు అతిగా తీసుకోకూడదంట, దీనిలో సోడియం ఎక్కువగా ఉండటం వలన ఇది రక్తపోటును పెంచుతుంది. గుండెపోటుకు కారణం అవుతుంది.
స్వీట్స్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి, చాలా మందికి స్వీట్స్ ఇష్టం. అయితే బీపీ సమస్య ఉన్నవారు స్వీట్స్ తినకూడదంట. దీని వలన అనేక సమస్యలు వస్తాయి.
బీపీతో బాధపడే వారు వేపుడు ఆహారాలకు చాలా దూరం ఉండాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. దీని వలన చెడు కొవ్వు పెరిగే ఛాన్స్ ఉన్నదంట.
అలాగే మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం, అందువలన బీపీ సమస్యతో సతమతం అయ్యే వారు ఎట్టిపరిస్థితుల్లో మద్యం సేవించకూడదంట.
అలాగే పాల ఉత్పత్తులకు సంబంధించిన ఆహార పదార్థాలను కూడా తినకూడదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. దీని వలన అనేక సమస్యలు వస్తాయంట.
అదే విధంగా ఎట్టి పరిస్థితుల్లో బీపీ సమస్యతో బాధపడే వారు కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోకూడదంట. దీని వలన అనేక సమస్యలు వస్తాయంట.