దూరం ఉంటేనే బతుకుతారు.. కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్ ఇదే!

Samatha

8 august  2025

Credit: Instagram

ప్రస్తుతం చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే దీనికి ముఖ్య కారణం  రుచి కోసం తీసుకునే ఆహారమే అంటున్నారు నిపుణులు.

కొన్ని రకాల ఫుడ్ అతిగా తీసుకోవడం వలన ఇది కిడ్నీల పనితీరు క్షీణించేలా చేస్తుందంట. కాగా, కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్ ఏదో ఇప్పుడు చూద్దాం.

వంటల్లో లేదా మీరు తీసుకునే ఆహారంలో ఉప్పు ఎక్కువగా ఉంటే, అది మెల్లిగా మీ కిడ్నీల పనితీరుకు ముప్పు కలిగిస్తుందంట.

స్వీట్ డ్రింక్స్ కిడ్నీలను సైలెంట్‌గా  బలహీనపరుస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే వీటికి దూరంగా ఉండాలంట.

ప్రాసెస్ చేసిన ఫుడ్ కిడ్నీలకు విషయం లాంటిది. దీనిని ఎక్కువగా తీసుకోవడం, అలాగే అధిక సోడియం ఉన్న ఫుడ్ తీసుకుంటే కిడ్నీ సమస్యలు వస్తాయంట.

మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. అయితే అల్కహాల్  అతిగా తీసుకోవడం వలన కూడా ఇది మెల్లిగా కిడ్నీల పనితీరును దెబ్బతీస్తుందంట.

చాలా మంది టీ, కాఫీలకు ఎక్కువగా అలవాటు పడిపోతుంటారు. వీటిని ఎక్కువగా తాగుతారు. అయితే టీ,కాఫీల్లో కెఫిన్ ఎక్కువగా ఉండటం వలన ఇది కిడ్నీలకు ప్రమాదం అంట.

అదే విధంగా ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకోవడం, ప్రోటీన్ ఓవర్ డోస్ అయినా కూడా ఫిల్టరేషన్ బలహీనపడుతుందంట.