పాలు ఖర్జూర కలిపి తింటున్నారా.. అయితే ఆ సమస్యలకు చెక్ పెట్టినట్లే!

Samatha

19 November 2025

ఖర్జూర, పాలు రెండూ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్స్, మినరల్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉండటం వలన ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయి.

అయితే చాలా మంది పాలు, ఖర్జూర రెండూ విడి విడిగా తింటుంటారు. కానీ ఈ రెండు కలిపి తీసుకోవడం వలన చాలా లాభాలు ఉన్నాయంట.

ప్రతి రోజూ ఒక గ్లాస్ వేడి పాలల్లో మూడు ఖర్జూరాలు వేసుకొని తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదంట. ఇందులోఉండే ఫైబర్ , కాల్షియం శరీరానికి మేలు చేస్తుంది.

ఖర్జూరాలను పాలతో కలిపి తీసుకోవడం వలన ఇది రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా, ఆరోగ్య సమస్యల నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి.

ఈ రెండు ప్రతి రోజూ కలిపి తీసుకోవడం వలన ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేసి, మలబద్ధకం సమస్యల నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది.

ఇక గ్యాస్ట్రిక్, ఉబ్బసం వంటి సమస్యలతో బాధపడే వారికి ఇది ఓ వరం అని చెప్పాలి. దీని వలన గ్యాస్ట్రిక్ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది.

ప్రతి రోజూ క్రమం తప్పకుండా వేడి పాలల్లో ఖర్జూర కలిపి తీసుకోవడం వలన ఇది ఎముకలను బలంగా తయారు చేయడమే కాకుండా ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

ఖర్జూరం, పాలు కలిపి తీసుకోవడం వలన ఇది చర్మం నిగారింపుగా తయారు అయ్యేలా చేస్తుంది. రక్తప్రసరణ మెరుగు పడుతుంది.