తులసి ఆకులు ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే వీటిని ప్రతి రోజూ తినడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.
తులసి ఆకు, నీరు చాలా శక్తివంతమైనది అంటారు. ఎందుకంటే ఇది ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. మానసికంగా, శారీకంగా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.
ప్రతి రోజూ ఉదయం తులసి ఆకులు తినడం వలన ఇవి రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా, జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తాయంట.
అదే విధంగా ఒత్తిడిని తగ్గించడంలో కూడా తులసి ఆకులు కీలక పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రతి రోజూ వీటిని తినడం వలన ఒత్తిడి తగ్గుతుందంట.
ముఖ్యంగా ఖాళీ కడుపుతో తులసి ఆకులను తినడం వలన ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, ఇన్ఫెక్షన్లతో పోరాడి, అంటు వ్యాధుల నుంచి రక్షిస్తాయి.
జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా తులసి ఆకులు కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి జీర్ణక్రియను మెరుగు పరిచి, గ్యాస్, ఎసిడిటి సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
తులసి ఆకుల రసం శరీరంలో విషాన్ని తెలిగించి, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అంతే కాకుండా ఒత్తిడి, ఆందోళనను కూడా తగ్గిస్తుంది.
తులసి ఆకులను ఖాళీ కడుపుతో క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.