బిర్యానీలో వేసే ఈ పువ్వు గురించి తెలుసా? దీంతో బోలెడు లాభాలు!

14  September 2025

Samatha

బిర్యానీ అంటే చాలా మందికి ఇష్టం. ఇక అది టేస్టీగా వస్తుందంటే అందులో ఎన్నో రకాల సుగంధ ద్రవ్యాలు వేస్తారు. అలాగే అందులో దగడ పువ్వు కూడా వేస్తారు.

ఇది మంచి సువాసన ఇవ్వడమే కాకుండా, వంటలకు మంచి రుచిని కూడా ఇస్తుంది. అయితే దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.

తెలుపు నలుపు రంగులో ఉండే దీనిని బ్లాక్ స్టోన్ ఫ్లవర్ అంటారు. ఇది ఒక సుగంధ ద్రవ్యం, దీనిని వంటల్లో వేస్తే వచ్చే టేస్ట్, స్మేల్ గురించి ఎంత చెప్పినా తక్కువే.

అయితే దీనిని వంటల్లో వేసుకొని తినడం వలన బోలెడు లాభాలు ఉన్నాయంట. దీనిని లైకెన్ లేదా దగడ పువ్వు, బిర్యానీ పువ్వు, బగారా పువ్వు అని కూడా పిలుస్తారు

అయితే దీనిని వంటల్లో వేసుకొని తినడం వలన శరీరంలో మంట తగ్గుతుందంట. అలాగే దీని వలన శరీరానికి చాలా మేలు జరుగుతుందంట.

అలాగే ఇందులో ఉండే యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాటీ బ్యాక్టీరియల్  లక్షణాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు నిపుణులు.

దీనిని తినడం వలన జీర్ణ క్రియ సాఫీగా సాగడమే కాకుండా, కడుపు నొప్పి, ఎసిడిటి, ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందంట.

అంతే కాకుండా ఇది కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే, పొట్ట, గర్భాశయంలో వచ్చే సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

అయితే ఇది ఆరోగ్యానికి చాలా మంచిదే అయినప్పటికీ దీనిని అతిగా తీసుకోవడం కూడా మంచిది కాదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.