ఉప్పు నీటితో స్నానం మంచిదేనా?

06 october 2025

Samatha

స్నానం చేయడం అనేది కామన్. అయితే కొంత మంది కర్పూరం స్నానం నీటిలో వేసుకొని స్నానం చేస్తే మరికొంత మంది ఉప్ప వేసుకొని స్నానం చేస్తుంటారు.

మరి ఇలా ఉప్పు నీటితో స్నానం చేయడం మంచిదేనా? దీని వలన ఎలాంటి లాభాలు ఉంటాయో చాలా మందికి తెలియదు.

కాగా, అసలు ఉప్పు నీటితో స్నానం చేయడం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి. అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఉప్పు నీటిలో సోడియం, క్లోరైడ్, అయోడిన్, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఐరన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.

అందువలన రోజూ ఇలా ఉప్పు నీటితో స్నానం చేయడం వలన కండారాల నొప్పి నంచి, ఒళ్లు నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చునంట.

అలసటతో బాధపడే వారు కూడా ప్రతి రోజూ స్నానం చేసే నీటిలో ఉప్పు వేసుకొని స్నానం చేయడం వలన అలసట తగ్గుతుందంట.

మంచి నిద్రకు కూడా ఉప్పు నీటి స్నానం చాలా మంచిదంటున్నారు నిపుణులు. ఉప్పు నీటితో స్నానం చేయడం వలన బాగా నిద్ర పడుతుందంట.

ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఉప్పు నీటితో స్నానం చేయడం వలన రక్త ప్రసరణ మెరుగు పడుతుందని చెబుతున్నారు వైద్యులు.