వామ్మో.. ముల్లంగిని వీటితో కలిపి తింటే ఒంట్లో విషంగా మారుతుందా!
12 February 2025
TV9 Telugu
TV9 Telugu
దుంపకూరల్లో ముల్లంగి ఒకటి. ఇది రుచికి కొంచెం వెగటుగా ఉండే మాట నిజమే. అయితేనేం.. ఇందులో పొటాషియం, పీచు, జింక్, భాస్వరం, మెగ్నీషియం, కాపర్, క్యాల్షియం, ఐరన్, మాంగనీస్, ఎ, బి6, సి, ఇ, కె విటమిన్లు విస్తారంగా ఉన్నాయి
TV9 Telugu
ఇంత మంచి పోషకాహారం కనుకనే చాలామంది తమ ఆహారంలో చేర్చుకుంటారు. కూర, చారు, పచ్చడి, సలాడ్.. ఇలా ముల్లంగితో ఏదైనా చేసుకోవచ్చు. ముల్లంగితో కంటిచూపు మెరుగవుతుంది. ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి. ఇది గుండెను కవచంలా కాపాడుతుంది
TV9 Telugu
ఎర్ర రక్తకణాలను వృద్ధి చేస్తుంది. రక్తానికి ఆక్సిజన్ అందించడంలో, బీపీని అదుపు చేయడంలో ఉపయోగపడుతుంది. ఒంట్లో చేరిన మలినాలను తొలగిస్తుంది. జీర్ణప్రక్రియ బాగుంటుంది. మధుమేహం నుంచి ఉపశమనం కలిగిస్తుంది
TV9 Telugu
కాలేయం, మూత్రపిండాల్లో అపసవ్యతలను తొలగిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అయితే ముల్లంగిని కొన్ని రకాల ఆహారాలతో కలిపి అస్సలు తినకూడదు. పొరబాటున వీటితో తిన్నారో అనారోగ్యానికి గురవుతారని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు
TV9 Telugu
నిపుణుల అభిప్రాయం ప్రకారం..కాకరకాయను ముల్లంగితో కలిపి తినకూడదు. కాకరకాయతో కలిపి తినడం వల్ల ముల్లంగిలోని సహజ పదార్థాలు శ్వాసకోశ సమస్యలను కలిగిస్తాయి
TV9 Telugu
ముల్లంగి తిన్న వెంటనే పాలు తాగడం వల్ల కడుపు సమస్యలు, గుండెల్లో మంట, అసిడిటీ మొదలైన ఆరోగ్య సమస్యలు దాడి చేస్తాయి. కాబట్టి, ముల్లంగి తిన్న రెండు గంటల తర్వాత పాలు తాగడం మంచిది
TV9 Telugu
ముల్లంగి తిన్న తర్వాత టీ తాగవద్దు. దీనివల్ల అసిడిటీ, మలబద్ధకం సమస్యలు వస్తాయి. అలాగే నారింజ పండ్లను కూడా ముల్లంగి తిన్న తర్వాత తినకూడదు. ఈ రెండింటి కలయిక విషపూరితమై కడుపు సమస్యలకు దారి తీస్తాయి
TV9 Telugu
అలాగే తరచుగా సలాడ్‌లో కీర దోస ముక్కలతో ముల్లంగిని కూడా కలిపి తింటుంటారు. కానీ వీటి కలయిక కూడా ఆరోగ్యానికి మరింత హానికరం. ఇకపై ఇలా చేయకండి