పిల్లల కోసం.. పుల్ల పుల్లగా చిటికెలో చేసే బూందీ గొట్టం మిక్చర్ ఇలా చేసి పెట్టండి 

Prasanna Yadla

 30 June  2026

Pic credit - Pinterest

పుల్ల పుల్లగా ఉండే  బూందీ గొట్టం మిక్చర్ మీ పిల్లలకు ఇలా చేసి పెట్టండి అసలు వదలకుండా తింటారు

 బూందీ గొట్టం మిక్చర్

మరి, ఇంక లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

ఎలా తయారు చేయాలంటే

ముందుగా మీరు ఒక  గిన్నెలో తీసుకుని దానిలో ఒక పప్పు బూందీ, అర కప్పు గొట్టం మిక్చర్ వేసి మంచిగా కలుపుకోవాలి

స్టెప్ 1  

ఇంకా దీనిలో ఒక కప్పు వేరుశెనగలు, అలాగే వేయించిన శనగపప్పు కూడా దీనిలో వేస్తే తినేటప్పుడు కరకరలాడే టేస్ట్ వస్తుంది.

స్టెప్ 2

ఇంకా దీనిలో కరివేపాకును కూడా  వేయించి ఈ మిక్చర్‌లో వేస్తె చెడిపోకుండా ఎక్కువ సమయం ఉంటుంది.

స్టెప్ 3

ఈ మిశ్రమంలో కొద్దిగా కారం పొడి, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు చల్లితే టేస్టీగా ఉంటుంది.

స్టెప్ 4

అలాగే చాట్ మసాలా, జీలకర్ర మరింత రుచి పెరుగుతుంది ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం చల్లితే  చాలా బాగుంటుంది.

స్టెప్ 5

ఇంకా దీనిలో  పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీరను కూడా కలిపి 10 నిమిషాలు పాటు పక్కన పెడితే మంచి రుచి వస్తుంది.

స్టెప్ 6