బత్తాయి పండ్లు రుచికి తియ్యగా బలేగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బత్తాయి పండ్లు రోగనిరోధక శక్తిని పెంపొదిస్తుంది. అంతేకాకుండా బత్తాయిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి
TV9 Telugu
బత్తాయిలో విటమిన్ సి, విటమిన్ ఎ, ఫోలేట్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వివిధ రోగాలు రాకుండా అడ్డుకుంటాయి. నీరసానికి గురైనప్పుడు గ్లాసుడు బత్తాయి జ్యూస్ తాగితే తక్షణ శక్తి వస్తుంది
TV9 Telugu
ముఖ్యంగా బత్తాయి రసంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వేసవిలో దీన్ని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి
TV9 Telugu
వేసవిలో శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. బత్తాయి జ్యూస్ తాగడం వల్ల శరీరాన్ని లోపలి నుండి చల్లబరుస్తుంది. హీట్ స్ట్రోక్ నుంచి రక్షిస్తుంది. దీన్ని తాగడం వల్ల హీట్ స్ట్రోక్ ప్రమాదం తగ్గుతుంది
TV9 Telugu
వేసవిలో చెమట ఎక్కువగా పడుతుంది. దీనివల్ల శరీరంలో నీరు తగ్గుతుంది. బత్తాయి రసం నీటి అవసరాన్ని తీర్చడమే కాకుండా, శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచే ఎలక్ట్రోలైట్‌లను కూడా అందిస్తుంది
TV9 Telugu
బత్తాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఇది ఇన్ఫెక్షన్లు, జలుబు-దగ్గు, వైరల్ వ్యాధులతో పోరాడటానికి బలాన్ని ఇస్తుంది
TV9 Telugu
బత్తాయి జ్యూస్‌లో ఉండే విటమిన్ సి చర్మ కాంతిని కాపాడటానికి సహాయపడుతుంది. అలాగే చర్మం నుంచి విషాన్ని తొలగిస్తుంది. తద్వారా మొటిమలు, మచ్చలు, చర్మం పొడిబారడం తొలగిపోతుంది
TV9 Telugu
బత్తాయి జ్యూస్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది గ్యాస్, మలబద్ధకం, అసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇది పేగులను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది