మీరూ పుట్టగొడుగులు తింటున్నారా?

28 June 2025

TV9 Telugu

TV9 Telugu

ఎక్కువకాలం జీవించడం ఒకెత్తయితే, బతికినంత కాలం ఆరోగ్యంగా జీవించడం మరొకెత్తు. ఇలాంటి నాణ్యమైన జీవితాన్నే అందిస్తాయట పుట్టగొడుగులు

TV9 Telugu

వీటిని తరచూ ఆహారంలో చేర్చుకుంటే డెమెన్షియా, సార్కోపెనియా(కండర క్షీణత)వంటి సమస్యలు రాకుండా ఉంటాయట. జర్మనీకి చెందిన లెబనీజ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎనలిటికల్‌ సైన్సెస్‌ ప్రకారం వయసుపెరిగేకొద్దీ మనలో కొన్ని కీలకమైన ఎంజైములు తగ్గిపోతూ ఉంటాయి

TV9 Telugu

ఫలితంగా శరీరంలో కండరాల క్షీణత మొదలవుతుంది. అలాగే ఒత్తిడి తట్టుకునే శక్తి కూడా తగ్గుతుంది. వీటికి ఎర్గోథయెనైన్‌ అనే మూలకం పరిష్కారం సూచిస్తుందట

TV9 Telugu

ఇది మనకి ఒత్తిడిని జయించే శక్తిని ఇవ్వడంతోపాటూ, కండరాలు క్షీణించకుండా చూస్తుంది. వయసుతో సంబంధం లేకుండా చురుగ్గా ఉండేట్టు చేస్తుంది

TV9 Telugu

పుట్టగొడుగులు మన ఆరోగ్యానికి ఇన్నిరకాలుగా మంచి చేస్తాయి. అందుకే వీటిని మన ఆహారంలో చేర్చుకోవాలి. ప్రతిరోజూ తినలేకపోయినా, కనీసం వారానికి ఒకసారి అయినా తినడానికి ప్రయత్నించాలి

TV9 Telugu

పుట్టగొడుగులలో లభించే యాంటీఆక్సిడెంట్లు మన రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. పుట్టగొడుగులలో లభించే సహజ పోషకాలు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి

TV9 Telugu

పుట్టగొడుగులు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి పుట్టగొడుగులు చాలా మంచివి. వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. త్వరగా ఆకలి వేయనీయవు

TV9 Telugu

పుట్టగొడుగులలో విటమిన్ డి అధికంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం. పుట్టగొడుగులు మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి