లవంగంతో కోరినంత ఆరోగ్యం.. రోజుకొక్కటి తింటే చాలు!

22 July 2025

TV9 Telugu

TV9 Telugu

ప్రతి ఇంటి వంటగదిలో రకరకాల సుగంధ ద్రవ్యాలు ఉంటాయి. వాటిలో లవంగం ఒకటి. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి

TV9 Telugu

లవంగాలు ఆహారంలో భాగం చేసుకుంటే క్యాన్సర్, మధుమేహం, పంటినొప్పి వంటి సమస్యలు నయం అవుతాయని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ వెల్లడించింది

TV9 Telugu

వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉండి ఫ్రీరాడికల్స్‌తో పోరాడి బరువుని తగ్గిస్తాయి. లవంగాల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఎలాజిక్‌ ఆమ్లాలు క్యాన్సర్‌ కణాలను వృద్ధి చెందకుండా కాపాడతాయి

TV9 Telugu

కడుపులో అల్సర్‌తో బాధపడేవారికి లవంగాలు ఉపశమనం కలిగిస్తాయి. వీటిల్లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, అల్సర్‌ వల్ల వచ్చే మంటను తగ్గిస్తాయి

TV9 Telugu

బరువు తగ్గించడంలో లవంగాలు కీలకపాత్ర పోషిస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌ - ఎ, సి, ఇ, కె విటమిన్లూ,  డైటరీ ఫైబర్‌ పుష్కలంగా ఉండి, కొవ్వులను వేగంగా కరిగించి బరువుని నియంత్రణలో ఉంచుతాయి

TV9 Telugu

ప్రతి ఉదయం ఒక లవంగం మొగ్గ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయట. రోజూ లవంగం తినడం వల్ల కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది కొవ్వు కాలేయ సమస్యలను నివారిస్తుంది

TV9 Telugu

ప్రతి ఉదయం ఒక లవంగాన్ని నమలడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. నోటిలో, ప్రేగులలో జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తి మెరుగుపడి, జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. ఇది కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది

TV9 Telugu

అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. లవంగాలు ఎముకల ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. దీనితో పాటు దంత ఆరోగ్యానికి కూడా ఇవి భలేగా ఉపయోగకరంగా ఉంటాయి. లవంగాలు నమలడం వల్ల చిగుళ్ల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది