కూర, చారు, పచ్చడి.. ఎందులోనైనా కొత్తిమీర కొంచెం వేసినా.. దాని రుచి రెట్టింపైపోతుంది. అందుకే దీనిని ఇష్టపడని వాళ్లు దాదాపుగా ఉండరు. ఆ పరిమళం అలాంటిది. ఇది రుచికే కాదండోయ్, ఆరోగ్యానికీ మంచిదే
TV9 Telugu
కొత్తిమీర మంచి పోషకాహారం. ఇందులో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఫోలిక్ యాసిడ్, కోలిన్, పొటాషియం, ఫాస్పరస్, భాస్వరం వంటి ఖనిజాలు, విటమిన్లు అధికంగా ఉన్నాయి
TV9 Telugu
ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. జీర్ణప్రక్రియను మెరుగుపరుస్తుంది. కడుపుబ్బరం, మలబద్ధక సమస్యలను నివారిస్తుంది
TV9 Telugu
ఇందులోని ఎ-విటమిన్ కళ్లకు మేలుచేస్తే, సి-విటమిన్ రోగనిరోధకశక్తిని పెంచుతుంది. ఇ-విటమిన్ కంటి కింది నల్లటి వలయాలను పోగొడుతుంది. రోజూ కాస్త కొత్తిమీర తినడం వల్ల మధుమేహం నుంచి ఉపశమనం కలుగుతుంది
TV9 Telugu
దంతాలు, ఎముకలు దృఢంగా ఉంటాయి. ఓస్టియోపొరాసిస్ లాంటి సమస్యలు తలెత్తవు. కొత్తిమీరలో విటమిన్ సి, విటమిన్ ఎ మంచి పరిమాణంలో ఉంటాయి. కాబట్టి ఇది రోగనిరోధక శక్తిని, చర్మ మెరుపును పెంచడానికి ఉపయోగకరంగా ఉంటుంది
TV9 Telugu
పచ్చి కొత్తిమీరలో తేమతోపాటు ప్రొటీన్లు, పీచుపదార్థాలు, కార్బోహైడ్రేట్లు కూడా లభిస్తాయి. అందుకే దీనిని తీసుకుంటే జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది
TV9 Telugu
దీని రసం వాంతులు, వికారం, కడుపు నొప్పి, అజీర్ణం, అసిడిటీ మొదలైన సమస్యల నుంచి ఉపశమనాన్ని అందించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. మధుమేహం ఉన్నవారికి రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది
TV9 Telugu
కొత్తిమీర తీసుకోవడం కళ్ళకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులోని విటమిన్ ఎ కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తప్రసరణ బాగుంటుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. దాంతో గుండెజబ్బులు వచ్చే అవకాశం తగ్గిస్తుంది