పసందైన ఆరోగ్యానికి.. తళతళ తమలపాకు!

04 February 2025

TV9 Telugu

TV9 Telugu

ఇంట్లో జరిగే పూజలు, శుభకార్యాలకు, ముత్తైదువులకు వాయనమివ్వడానికి.. పూలు పండ్లతో పాటు ఎక్కువగా ఉపయోగించేది తమలపాకులే. ఇలా శుభప్రదంగా వాడే తమలపాకులు కొన్ని రకాల అనారోగ్యాల్నీ దూరం చేస్తాయంటున్నారు నిపుణులు

TV9 Telugu

దీనిలోని సుగుణాల దృష్ట్యా చాలా మందికి తమలపాకు తినేందుకు ఇష్టపడతారు. ఇది రుచిలో గొప్పగా ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది

TV9 Telugu

తమలపాకుల్ని నమిలి, ఆ రసాన్ని మింగడం వల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. అందుకే భోజనం చేశాక తాంబూలం వేసుకోవడం మంచిదంటారు

TV9 Telugu

గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో తమలపాకులు ఎంతగానో మేలు చేస్తాయి. ఛాతీలో నొప్పి, గుండెలో మంట.. మొదలైన సమస్యలతో బాధపడేవారు తమలపాకుల రసాన్ని తాగితే ఉపశమనం లభిస్తుంది

TV9 Telugu

వెన్నునొప్పితో బాధపడేవారు.. తమలపాకులకు కొద్దిగా నూనె రాసి వెన్నునొప్పి ఉన్నచోట మర్దన చేస్తే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది

TV9 Telugu

తమలపాకులో కాల్షియం, విటమిన్ సి, కెరోటిన్, రిబోఫ్లేవిన్, నియాసిన్, యాంటీ-ఆక్సిడెంట్లు, క్లోరోఫిల్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. తమలపాకులో ఉండే యూజినాల్ శరీరం నుంచి చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది

TV9 Telugu

దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. తమలపాకులలో లభించే సమ్మేళనాలు జీవక్రియను పెంచుతాయి. శరీర కొవ్వును తగ్గిస్తుంది. ఇది బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది

TV9 Telugu

తమలపాకులలో యాంటీ-హైపర్గ్లైసీమిక్ లక్షణాలు ఉన్నాయి. ఇవి రక్తంలో చక్కెర సమస్యను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇందులోని యాంటీ ఫంగల్ లక్షణాలు వల్ల.. ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అందుకే రోజుకొక్క ఆకు తినడం మంచిది