కొబ్బరి... అందరికీ అందుబాటులో ఉండే పోషఖాల ఖజానా. దీన్ని పచ్చిగా తిన్నా, పాలలా ఉపయోగించినా బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం
TV9 Telugu
పొటాషియం, ఐరన్, విటమిన్ సి, ఈతో పాటు ఎన్నో ఖనిజాలు కొబ్బరిలో మెండుగా ఉంటాయి. ఇందులో కార్బోహైడ్రేట్స్ తక్కువగానూ ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగానూ ఉంటాయి
TV9 Telugu
ముఖ్యంగా ఆరోగ్యకరమైన కొవ్వులు ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ హార్మోన్లను సమతుల్యం చేస్తాయి. నెలసరి ఇబ్బందులను నియంత్రిస్తాయి. అందుకే అమ్మాయిలు తప్పనిసరిగా తినాలి
TV9 Telugu
కొబ్బరిలోని మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్లు శక్తిమంతమైన యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ముఖ్యంగా ఇది నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ వ్యాధినిరోధకశక్తిని బలోపేతం చేస్తాయి
TV9 Telugu
లారిక్ యాసిడ్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్ గుణాలు వివిధ రకాల వ్యాధులతో పోరాడే శక్తిని శరీరానికి ఇస్తాయి
TV9 Telugu
రక్తహీనతతో బాధపడేవారు రోజూ కాస్త కొబ్బరి తిన్నా, కొబ్బరిపాల రూపంలో తీసుకున్నా సమస్య దూరమవుతుంది. అలానే తగినంత కాల్షియం అందించి ఎముకబలాన్నీ పెంచుతుంది
TV9 Telugu
ఎప్పుడైనా కండరాలు పట్టేసినట్లు అనిపించినా, నొప్పిగా అనిపించినా కొబ్బరితో తయారు చేసిన ఆహారమేదైనా తీసుకోండి
TV9 Telugu
దీనివల్ల శరీరానికి తగినంత మెగ్నీషియం అందుతుంది. కండరాలకు తగినంత విశ్రాంతి దొరికి నొప్పుల నుంచి కాస్త ఉపశమనం కలుగుతుంది