పుచ్చకాయపై ఇది చిటికెడు చల్లి తిన్నారంటే.. మీ ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదిక!

06 May 2025

TV9 Telugu

TV9 Telugu

ఎండల్లో అందరి చూపు పుచ్చపండ్ల మీదికే మళ్లుతుంది. ఎర్రటి గుజ్జుతో కూడి, చూడగానే నోరూరించే వీటిల్లో నీటిశాతం చాలా ఎక్కువ. సుమారు 95శాతం వరకూ నీరే ఉంటుంది

TV9 Telugu

పుచ్చకాయలో విటమిన్ సి, విటమిన్ ఎ, పొటాషియం, లైకోపీన్ వంటి పోషకాలు పుష్కలంటా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి, చర్మానికి కూడా చాలా మేలు చేస్తాయి. వేసవి సూపర్‌ఫుడ్ పుచ్చకాయ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులోని విటమిన్ సి , ఎ చర్మానికి మేలు చేస్తాయి

TV9 Telugu

పుచ్చకాయలో తగినంత నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. వేసవిలో పుచ్చకాయ తినడం వల్ల డీహైడ్రేషన్, అలసట వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది

TV9 Telugu

అయితే చాలా మందికి పుచ్చకాయ ముక్కలపై నల్ల ఉప్పు కలిపి తినడం అలవాటు. రుచి బాగుంటుందని మీరూ ఇలా చేస్తుంటే మాత్రం ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి

TV9 Telugu

పుచ్చకాయ మీద నల్ల ఉప్పు చల్లి తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. పుచ్చకాయపై నల్ల ఉప్పు చల్లి తినడం వల్ల అసిడిటీ, అజీర్ణం, మలబద్ధకం వంటి కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుందట

TV9 Telugu

పుచ్చకాయలో పుష్కలంగా నీరు ఉంటుంది. దీనిలో ఉండే విటమిన్ సి కొల్లాజెన్‌ను పెంచుతుంది. ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఇది ముఖంపై వృద్ధాప్య సంకేతాలు, మొటిమలు వంటి సమస్యల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది

TV9 Telugu

పుచ్చకాయపై నల్ల ఉప్పు వేసి తినడం ద్వారా రక్తపోటును కూడా అదుపులో ఉంచుకోవచ్చు. తక్కువ రక్తపోటుతో బాధపడేవారు పుచ్చకాయ ముక్కలపై నల్ల ఉప్పు కలిపితినొచ్చు

TV9 Telugu

పుచ్చకాయలో పొటాషియం ఉంటుంది. ఇది గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది