ఉల్లి కాడల్లో శనగపప్పు వేసి కూర చేస్తే సూపర్. అంతేనా.. సూప్, సలాడ్, పాన్‌కేక్, నూడుల్స్, ఫ్రిట్టర్స్.. ఇలా ఏ వంటలో వేసినా రుచి అదుర్స్
TV9 Telugu
స్ప్రింగ్ ఆనియన్స్‌తో చేసిన వంటకాలు ఆరోగ్యానికి కూడా భలేగా మేలు చేస్తాయి. ఈ ఉల్లిపాయలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది
TV9 Telugu
సాధారణంగా ఆహార రుచిని పెంచడానికి వంటల్లో ఉల్లిపాయలను ఉపయోగిస్తారు. కానీ ఘాటైన వాసన కలిగిన ఉల్లిపాయ కాడల ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియదు
TV9 Telugu
వీటిల్లో విటమిన్ సి, ఇతర యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి. పోషకాలతో సమృద్ధిగా ఉండే ఉల్లికాడలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి
TV9 Telugu
రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా, ఇది శరీరాన్ని వివిధ వ్యాధుల నుంచి రక్షిస్తుంది. ఉల్లి కాడల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేస్తుంది
TV9 Telugu
ఇందులో ఉండే అల్లిసిన్, క్వెర్సెటిన్ కొలెస్ట్రాల్, రక్తపోటును తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఇది పేగులో మంచి బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది
TV9 Telugu
ఉల్లిలోని క్విర్‌సిటిన్ అనే పోషకం... ఎండబారిన పడి చర్మం ఎర్రగా మారడం, దద్దుర్లు బారిన పడటం వంటి సమస్యల నుంచి కాపాడుతుంది. ఎండకారణంగా దెబ్బతిన్న కణజాలాన్ని పునరుద్ధరిస్తుంది
TV9 Telugu
ఉల్లి జీర్ణవ్యవస్థను వివిధ బ్యాక్టీరియాల నుంచి కాపాడుతుంది. వ్యాధినిరోధక శక్తిని గణనీయంగా పెంచుతుంది. అందుకే వీలున్నప్పుడు ఉల్లి కాడలను ఆహారంలో తీసుకోవడం అలవాటు చేసుకోవాలి