కీరదోస సలాడ్ ఇలా తినే అలవాటు మీకూ ఉందా? వెంటనే మానుకోండి..
01 May 2025
TV9 Telugu
TV9 Telugu
చల్లదనానికి చిరునామా అయిన కీరా దోసకాయ ప్రత్యేకత అంతాఇంతాకాదు. చూడగానే గుర్తొచ్చే దీని ఆ చలువ లక్షణం వల్ల కొంతమంది కీరా ముక్కలతోనే అల్పాహారాన్ని మొదలుపెడితే మరికొందరు రైతా, శాండ్‌విచ్, సోడా, జ్యూసుల్లానూ ఆహారంలో భాగం చేసుకుంటున్నారు
TV9 Telugu
పిల్లలు, పెద్దలకే కాదు, రకరకాల డైటింగులు చేసేవారికీ ఎన్నో ప్రయోజనాలు అందించే కీరా గురించి ఇంకా చాలా విశేషాలే ఉన్నాయి. మనమైతే దీన్నీ కూరగాయల్లో ఒకటిగా కలిపేసుకుంటాం కానీ నిజానికి ఇది ఒక పండు
TV9 Telugu
కీరదోసలో 90 శాతం నీరు ఉంటుంది. దీనితో పాటు, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం, విటమిన్ సి, విటమిన్ కె వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వేసవిలో ఇది డీహైడ్రేషన్ సమస్య నుంచి కాపాడటంలో సహాయపడుతుంది
TV9 Telugu
అయితే చాలా మంది కీరదోసను సలాడ్‌గా తినడానికి ఇష్టపడతారు. వీరు కీరదోసకు ఉప్పు, చాట్ మసాలా వేసి తింటుంటారు. కానీ ఈ పద్ధతి సరైనదేనా? కాదా? అని మాత్రం ఆలోచించరు
TV9 Telugu
నిపుణులు ఏం చెబుతున్నారంటే.. సలాడ్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప్పు లేదా చాట్ మసాలా వేసి తినకూడదని అంటున్నారు. ఎందుకంటే ఇలా తీసుకుంటే శరీరంలో అదనపు సోడియం పెరుగుతుది
TV9 Telugu
కీరదోసలో చాట్ మసాలా వేసి తినడం వల్ల ఎలక్ట్రోలైట్ సమతుల్యత దెబ్బతింటుంది. కీరదోస సలాడ్‌లో ఉండే నీటి శాతం కూడా తగ్గుతుంది
TV9 Telugu
మన ఆహారంలో కూడా ఉప్పు ఉంటుంది.దోసకాయను దానిపై ఉప్పు లేదా చాట్ మసాలా చల్లి తింటే ఉప్పు తీసుకోవడం పెరుగుతుంది. ఇలా అధిక ఉప్పు తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం
TV9 Telugu
కీరదోస సలాడ్‌ని వివిధ పండ్లతో కలిపి తీసుకోవడం మంచిదని నిపుణులు అంటున్నారు. లేదంటే సలాడ్ డ్రెస్సింగ్ కోసం నిమ్మకాయ, సాదా పెరుగును ఉపయోగించవచ్చు