ఏ పని మొదలవ్వాలన్నా.. ఇంట్లో వాళ్లలో పొద్దున్నే చురుకు పుట్టించాలన్నా.. గుర్తొచ్చేది ఘుమఘుమలాడే టీ. దానివల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయి
TV9 Telugu
టీ రుచులు ఇష్టపడని వారు దాదాపు ఉండరు. కొంతమంది చక్కెరతో పాలు టీని ఇష్టపడతారు. మరికొందరు బ్లాక్ టీని ఇష్టపడతారు. ఎలా తీసుకున్న టీ ప్రియులు దీన్ని మత్తులో మునగాల్సిందే
TV9 Telugu
టీ తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. మరీ ఎక్కువ టీ తాగడం వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజూ పరిమిత మోతాదులో టీ తాగడం వల్ల ఎటువంటి హాని ఉండదు
TV9 Telugu
అయితే, టీలో కెఫిన్ ఉంటుంది. కాబట్టి టీ తాగే పరిమాణాన్ని కాస్త పరిమితం చేయాలని నిపుణులు అంటున్నారు. ఇందులోని కెఫిన్ అధికంగా శరీరంలోకి ప్రవేశిస్తే, అది దుష్ప్రభావాలకు కారణమవుతుంది
TV9 Telugu
చాలా మంది నిద్ర లేవగానే టీ తాగుతారు. ఖాళీ కడుపుతో టీ తాగడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల కొన్నిసార్లు అసిడిటీ ప్రమాదం అధికంగా పెరుగుతుంది
TV9 Telugu
టీ తాగడానికి, ఆహారం తినడానికి మధ్య కనీసం గంటన్నర సమయం విరామం ఉండాలి. లేకుంటే శారీరక సమస్యలు రావచ్చు. రోజుకు 2-3 కప్పుల టీ తాగవచ్చు. అంతకంటే ఎక్కువ తాగడం మంచిది కాదు
TV9 Telugu
టీలో తక్కువ మొత్తంలో కూడా టానిన్లు ఉంటాయి. టానిన్లు ఆమ్ల స్రావాన్ని పెంచుతాయి. దీని ఫలితంగా గుండెల్లో మంట వస్తుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉండటానికి టీ ఎక్కువగా తాగడం అంత మంచిది కాదు. పరిమిత పరిమాణంలో క్రమం తప్పకుండా టీ తాగడం వల్ల అలసట నుంచి ఉపశమనం లభిస్తుంది
TV9 Telugu
ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. కొంచెం టీ తాగడం మంచిది. కానీ ఎవరైనా ఎక్కువగా టీ తాగితే, అది నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. ఇది నాడీ వ్యవస్థతో సమస్యలను కలిగిస్తుంది