ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగే అలవాటు మీకూ ఉందా?

04 September 2025

TV9 Telugu

TV9 Telugu

రోగనిరోధకశక్తి బలోపేతం కావటానికి తేనె బాగా ఉపయోగపడుతుంది. ఇందులో విశృంఖల కణాలను, హానికారక బ్యాక్టీరియాను అడ్డుకునే గుణాలు దండిగా ఉంటాయి

TV9 Telugu

క్యాల్షియం, ఐరన్‌, సోడియం, ఫాస్ఫరస్‌, సల్ఫర్‌, పొటాషియం వంటి ఖనిజ లవణాలతో పాటు విటమిన్‌ సి, విటమిన్‌ బి వంటి విటమిన్లు, ప్రొటీన్లు కూడా ఉంటాయి

TV9 Telugu

ముదురు రంగు తేనెలో యాంటీఆక్సిడెంట్లు ఇంకాస్త ఎక్కువగా ఉంటాయి. ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో చెంచాడు తేనె, సగం చెక్క నిమ్మరసం కలిసి పరగడుపున తాగితే మలబద్ధకం, ఛాతీ మంట తగ్గుతాయి

TV9 Telugu

ఊబకాయం తగ్గటానికి ఉపవాసం చేసేవారు తేనె, నిమ్మరసం కలిపిన నీళ్లు తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇన్ని లాభాల ఉన్నాయి కనుకే చాలా మంది ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో గ్లాసుడు నిమ్మ నీటితో తమ రోజును ప్రారంభిస్తారు

TV9 Telugu

ఈ అలవాటు ప్రయోజనకరమైనదే అయినప్పటికీ, దీనివల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగడం వల్ల ఎముకలు బలహీనపడతాయి. నిమ్మకాయలోని ఆమ్లత్వం ఎముకలలో కొవ్వును తగ్గిస్తుంది

TV9 Telugu

నిమ్మలోని ఆమ్లత్వం దంతాలను దెబ్బతీస్తుంది. వాటిని సున్నితంగా మారుస్తుంది. అంతేకాదు, దంతాల బలాన్ని కూడా తగ్గించి.. దంతాలను దెబ్బతీస్తుంది. ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు

TV9 Telugu

నిమ్మరసంలో ఆస్కార్బిక్ ఆమ్లం అధికంగా ఉండటం వల్ల మూత్ర విసర్జన పెరుగుతుంది. కాబట్టి నిమ్మరసాన్ని మితంగా మాత్రమే తీసుకోవాలి. ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగడం వల్ల అసిడిటీ, గుండెల్లో మంట, వాంతులు, గ్యాస్ వంటి సమస్యలు కూడా వస్తాయి

TV9 Telugu

నిమ్మలోని కొన్ని లక్షణాలు మూత్రపిండాలపై ఒత్తిడిని పెంచుతాయి. కాబట్టి ఖాళీ కడుపుతో నిమ్మరసం తీసుకోవడం అంత మంచిది కాదు. నిమ్మరసం ఎక్కువగా తాగడం వల్ల విరేచనాలు, వికారం, గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా వస్తాయి. దానిలోని ఆమ్లత్వం గొంతు నొప్పికి కారణమవుతుంది