వీరికి సోంపు గింజలు యమ డేంజర్‌..! తిన్నారో కైలాసానికే..

17 July 2025

TV9 Telugu

TV9 Telugu

కిచెన్‌లో రకరకాల సుగంధ ద్రవ్యాలు ఉంటాయి. ఇవన్నీ మన ఆరోగ్యానికి మేలు చేసేవే. అందులో సోంపు ఒకటి. వీటితో తయారు చేసిన టీలను ఉదయాన్నే తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి 

TV9 Telugu

వక్కపొడికి బదులుగా కొంత మందికి సోంపు తినడం అలవాటు. వక్క రక్తాన్ని విరుస్తుంది. సోంపులో అలాంటి హాని చేసే గుణాలేమీ లేవు. పైగా ఎన్నో విధాల మేలు చేస్తుంది. దీన్ని రోజూ కాస్త తింటే ఎన్నో ఉపయోగాలున్నాయి

TV9 Telugu

చాలా మంది ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఏదైనా తిన్న తర్వాత సోంపు తింటారు. దీనిని మౌత్ వాష్ గా, వంట రుచిని పెంచడానికి ఉపయోగిస్తారు. సోంపు తినడం వల్ల ఈస్ట్రొజెన్‌ హార్మోన్‌ పని తీరు మెరుగై పాలు సమృద్ధిగా తయారవుతాయి

TV9 Telugu

భోజనం చేయగానే చిటికెడు సోంపు నోట్లో వేసుకుంటే ఆహారం వేగంగా అరుగుతుంది. జీర్ణశక్తికి దోహదం చేసే వాము, పుదీనాల్లాంటిదే సోంపు కూడా. దీన్ని దోరగా వేయించి గ్రైండ్‌ చేసి తడి లేని, గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేస్తే చాలా రోజులు తాజాగానే ఉంటుంది

TV9 Telugu

ఆ పొడిని రోజూ ఒక చెంచా చొప్పున తేనెలో రంగరించి ఓ నెల రోజులు క్రమం తప్పక తింటే జీర్ణ ప్రక్రియలో ఇబ్బందులు, ఆకలి మందగించడం లాంటి సమస్యలు నయమైపోతాయి

TV9 Telugu

సోంపు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ మోతాదు మించి తింటే అనర్ధాలు వస్తాయి. సోంపు ఎక్కువగా తినడం వల్ల చాలా మందికి చర్మ అలెర్జీలు వస్తాయి. అలాగే సోంపును అధికంగా తినడం వల్ల కడుపు నొప్పి వస్తుంది. ఇందులో ఫైటోఈస్ట్రోజెన్లు ఉంటాయి, ఇవి హార్మోన్ల సమతుల్యతను ప్రభావితం చేస్తాయి

TV9 Telugu

గర్భిణీలు, పాలిచ్చే స్త్రీలు ఎక్కువగా సోంపు తినకూడదు. ఇది గర్భాశయ సంకోచాలకు కారణమవుతుంది. ఇది గర్భస్రావం ప్రమాదాన్ని పెంచుతుంది. రక్తం సులభంగా గడ్డకట్టని వారు ఎక్కువగా సోంపు తినడం మంచిది కాదు. సోంపు రక్తాన్ని పలుచబరిచే గుణాన్ని కలిగి ఉంటుంది

TV9 Telugu

ఎటువంటి ఆరోగ్య సమస్యలులేని వ్యక్తులు రోజుకు కొద్ది మొత్తంలో (1 టీస్పూన్) సోంపును సురక్షితంగా తినవచ్చు. అదే ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం వైద్య సలహా తీసుకోవడం మంచిది