చలికాలంలో బాదంపప్పు ఇలా తిన్నారంటే.. ప్రమాదం కొనితెచ్చుకున్నట్లే!
31 December 2024
TV9 Telugu
TV9 Telugu
మాంగనీస్, మెగ్నీషియం, పీచు, ఆరోగ్యకరమైన కొవ్వు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే బాదంపప్పు మంచి పోషకాహారం
TV9 Telugu
ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ముఖ్యంగా చాలికాలం సాధారణంగా వచ్చే అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలంటే రోజూ ఐదారు బాదం గింజలు తినడం అలవాటు చేసుకోవాలి
TV9 Telugu
చర్మం ముడతలు పడదు, మెరుపు, మృదుత్వం వస్తాయి.కంటి కింద వలయాలు నయమవుతాయి. దాంతో వయసు మీదపడినట్లు అనిపించదు. గుండె జబ్బులనే కాక.. క్యాన్సర్, అల్జీమర్స్ లాంటి భయానక వ్యాధులనూ నిరోధిస్తుంది
TV9 Telugu
సాధారణంగా వేసవిలో చాలా మంది నానబెట్టిన బాదంపప్పు తింటారు. అయితే చలికాలంలో బాదంపప్పును తినడానికి సరైన మార్గం ఏమిటో చాలా మందికి తెలియదు
TV9 Telugu
నిజానికి చలికాలంలోనూ నానబెట్టిన బాదంపప్పులను తింటే రెట్టింపు మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ కాలంలో పగటిపూట బలహీనమైన జీవక్రియ ఉంటుంది. దీంతో కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంది
TV9 Telugu
దీంతో కాలేయం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇలా జరగకుండా ఉండాలంటే బాదంపప్పును రాత్రంతా నానబెట్టి, మరుసటి రోజు ఉదయం పొట్టు తీసేసి తింటే ఆరోగ్యానికి ఎలాంటి డోకా ఉండదని నిపుణులు చెబుతున్నారు
TV9 Telugu
కానీ ఏ డ్రై ఫ్రూట్స్ అయినా పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. మీ బరువు, వయసును బట్టి ఏ డై ఫుట్‌ను ఏ పరిమాణంలో తీసుకోవాలో నిపుణుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి
TV9 Telugu
చలికాలంలో బాదంపప్పును నానబెట్టకుండా తింటే, అది ఒంట్లో కొలెస్ట్రాల్ సమస్యను కలిగిస్తుంది. ఎందుకంటే ఈ కాలంలో కేలరీలను బర్న్ చేయడం చాలా ముఖ్యం. అదే నానబెట్టిన బాదంతో ఈ సమస్య ఉండదు