ఈ సీజన్‌లో ఉదయాన్నే చిన్న అల్లం ముక్క నోట్లో వేసుకుంటే..

25 November 2025

TV9 Telugu

TV9 Telugu

చలిలో వచ్చే జలుబు, దగ్గు, తల నొప్పి వంటి వాటికి కాస్త అల్లం టీ తాగితే వచ్చే మజా.. అంత ఇంతా కాదు. ఉదయం ఖాళీ కడుపుతో చిన్న అల్లం ముక్క నమలడం వల్ల వికారం, తలతిరగడం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది

TV9 Telugu

చలిలో అల్లం నమలడం వల్ల అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది

TV9 Telugu

ఔషధ గుణాలున్న అల్లాన్ని హోమియోపతిలో కూడా ఉపయోగిస్తారు. వంటింట్లో అందరికీ అందుబాటులో ఉండే అల్లం జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది

TV9 Telugu

కడుపు ఉబ్బరం, ఆహారం జీర్ణం కాకపోవటం వంటి సమస్యలున్న వాళ్లు అల్లం వేసి మరగబెట్టిన నీటిని తాగటం మంచిది

TV9 Telugu

కొలస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. అల్లం రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. దీనివల్ల డయాబెటీస్‌ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి

TV9 Telugu

కిడ్నీ సమస్యలతో బాధపడేవారు.. నీటిలో అల్లం వేసి మరిగించి, కాస్త నిమ్మ రసం కలిపి తాగితే మంచి ఫలితాలుంటాయి. అల్లంలోని శక్తివంతమైన శోథ నిరోధక లక్షణాలు కీళ్ల నొప్పులు, పీరియడ్స్‌ నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి

TV9 Telugu

బరువు తగ్గించేందుకు అల్లం చక్కగా ఉపయోగపడుతుంది. రోజూ ఉదయం అల్లం వేసి మరిగించిన నీటిని తాగటం వల్ల అనవసరమైన కొవ్వు కరుగుతుంది

TV9 Telugu

ఉదయం లేవగానే నీటిలో అల్లం వేసి మరిగించాలి. ఈ నీళ్లను వడగట్టి తేనె, పుదీనా ఆకులు వేసుకుని తాగండి. అందుకే రోజూ వండే కూరల్లో కచ్చితంగా అల్లం చేర్చుకోండి