అందానికీ.. ఆరోగ్యానికీ దానిమ్మ సాయపడుతుందని తెలుసు. తొక్కతోనూ బోలెడు ప్రయోజనాలున్నాయి. ఈ తొక్కలను వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు
TV9 Telugu
దానిమ్మ తొక్కలను ఎండబెట్టి పొడి చేయండి. గోరువెచ్చని నీటిలో ఈ పొడిని కొంచెం కలిపి గొంతును తాకేలా పుక్కిలించి ఊయండి. గొంతునొప్పి, దగ్గు నుంచి ఉపశమనం దొరుకుతుంది
TV9 Telugu
దీనిలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలెక్కువ. దద్దుర్లు, యాక్నే, మొటిమలు వంటివి ఉంటే దానిమ్మ తొక్క పొడిలో గులాబీ నీరు, తేనె కలిపి రాసి ముఖమంతా రాసి చూడండి
TV9 Telugu
మృతకణాలు తొలగడమే కాదు.. ఈ సమస్యల నుంచీ ఉపశమనం లభిస్తుంది. రీరాన్ని డీటాక్సిఫై చేయడానికి ఎన్నో ప్రక్రియలను ఉపయోగిస్తుంటాం కదా! దానిమ్మ కూడా శరీరంలోని మలినాలను బయటకు పంపడంలో చాలా బాగా సాయపడుతుంది
TV9 Telugu
దానిమ్మ తొక్కలను నీడలో ఆరబెట్టి మెత్తని పొడిలా తయారు చేసుకోవాలి. ఈ పొడిని ఒక టీస్పూన్ తీసుకుని అందులో రోజ్ వాటర్ కలిపి కొంత సమయం నానబెట్టి, ఈ పేస్ట్‌ను ముఖానికి ఫేస్ మాస్క్ వేసుకుంటే మృదువైన, మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది
TV9 Telugu
దానిమ్మ తొక్కల పేస్ట్‌ను ముఖ్యంగా మచ్చలు ఉన్న చోట రాయాలి. ముఖం పూర్తిగా ఆరిపోయిన తర్వాత నీటితో కడుక్కోవాలి. ఈ మాస్క్ మొదటిసారి వాడగానే మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ ప్యాక్‌ను వారానికి రెండు నుంచి మూడు సార్లు ఉపయోగించవచ్చు
TV9 Telugu
నోటి దుర్వాసన, చిగుళ్ళ నుంచి రక్తం కారుతుంటే, దానిమ్మ తొక్కల పొడిని నీటిలో కలిపి, ఆ నీటిని నోటిలో వేసి కొన్ని నిమిషాలు అలాగే ఉంచి పుక్కిలించాలి. ఇలా క్రమంగా చేయడం వల్ల కొన్ని రోజుల్లో ఈ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది
TV9 Telugu
దానిమ్మ తొక్కలతో కంపోస్ట్ ఎరువులను కూడా తయారు చేయవచ్చు. దానిమ్మ తొక్కలను కడిగి నీటిలో మరిగించి, ఆ నీటిని వడకట్టి, గోరువెచ్చగా ఉన్నప్పుడు పుక్కిలిస్తే గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. దానిమ్మ తొక్కలను ఎండబెట్టి, టీ తయారు చేసుకుని తాగవచ్చు. ఈ టీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది