ఘుమఘుమలాడే సాంబర్‌ మసాలా.. ఎలా తయారు చేయాలో తెల్సా?

08 June 2025

TV9 Telugu

TV9 Telugu

కూర, పచ్చడితో అన్నం తినేశాక కాస్త సాంబార్‌ ఉంటే ఎంత బాగుంటుంది కదూ! ఆ నోరూరించే సాంబార్‌ను ఇంట్లోనే చేసినా.. అందుకు అవసరమైన పొడిని మాత్రం చాలామందికి కొనుక్కోవడమే అలవాటు

TV9 Telugu

అందుకు బదులుగా ఇంట్లోనే సులువుగా చేసుకోవచ్చు. ఎలాగంటారా.. పావు కప్పు శనగపప్పు, రెండు చెంచాల మినప్పప్పు, 2 టేబుల్‌స్పూన్ల జీలకర్ర, అర టేబుల్‌స్పూన్‌ ఆవాలు తీసుకోవాలి

TV9 Telugu

అలాగే అర కప్పు ధనియాలు, ఒకటిన్నర చెంచా మెంతులు, చెంచా మిరియాలు, అర చెంచా చొప్పున ఇంగువ, పసుపు, 10 ఎండు మిరపకాయలు, 15 కరివేపాకు రెబ్బలు తీసుకోవాలి

TV9 Telugu

ముందుగా కడాయిలో ధనియాలు, జీలకర్రలను సన్న సెగ మీద రెండు నిమిషాలు వేయించాలి. మంచి వాసన వస్తుండగా వాటిని పల్లెంలోకి తీసుకోవాలి

TV9 Telugu

ఆ తర్వాత ఎండుమిరపకాయలు కొన్ని క్షణాలు వేయించాలి. వాటిని తీసి మెంతులు, అవి వేగాక మిరియాలు, అవి వేగాక శనగపప్పు, తర్వాత మినప్పప్పు, తర్వాత కరివేపాకు, అది కూడా వేగాక ఆవాలను వేయించి తీయాలి

TV9 Telugu

స్టవ్వు కట్టేసి.. కడాయిలో ఇంగువ వేయాలి. ఆ వేడికి మంచి వాసన వస్తుంది. ఈ వేయించిన దినుసులన్నీ చల్లారాక పసుపు జోడించి గ్రైండ్‌ చేయాలి 

TV9 Telugu

జార్‌ చిన్నగా ఉంటే రెండు మూడు దఫాలుగా చేయొచ్చు. మెత్తగా అయ్యాక బాగా కలిపి తడి లేని సీసాలో భద్రం చేసుకుంటే సరిపోతుంది

TV9 Telugu

ఇది ఏడాదంతా నిల్వ ఉంటుంది. ఇడ్లీ నుండి దోసె వరకు, దక్షిణ భారత వంటకాలు అన్నింటిలో ఫేమస్‌ అయిన సాంబార్‌కు ప్రత్యేక రుచిని అందిచడంలో ఈ సాంబర్‌ మసాలాకు మించిన రెమెడీ మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు