నిగనిగ దానిమ్మ.. రోజూ పొద్దున్నే గుప్పెడు తిన్నారంటే..?
07 June 2025
TV9 Telugu
TV9 Telugu
ఎర్రటి దానిమ్మ గింజలని చూస్తే మనసుదోచే కెంపులే గుర్తుకొస్తాయి. దానిమ్మ గింజలే కాదు పూలు, కాయలదీ ప్రత్యేకమైన అందమే. చూపులకు అందాన్ని మాత్రమే కాదు తింటే ఆరోగ్యాన్ని కూడా పెంచుతాయి
TV9 Telugu
మనకు అవసరమైన అన్ని పోషకాలు దానిమ్మ పండ్లలో దండిగా ఉంటాయి. విటమిన్లు, పీచు, యాంటీఆక్సిడెంట్లు, క్యాన్సర్ నిరోధకాలతో పాటు వృద్ధాప్యం త్వరగా ముంచుకు రాకుండా చూసే గుణాలూ ఇందులో నిక్షిప్తమై ఉన్నాయి
TV9 Telugu
ఇవి చర్మం నిగనిగలాడటానికీ తోడ్పడతాయి. దానిమ్మ గింజల్లోని నూనె చర్మం పైపొరను (ఎపిడెర్మిస్) బలోపేతం చేస్తుంది. ఫలితంగా ముడతలు పడటమూ తగ్గుతుంది
TV9 Telugu
చర్మం ముడతలు పడేది పైపొరలోనే మరి! ఒక్క చర్మ సౌందర్యం ఇనుమడించేలా చేయటమే కాదు.. వయసుతో పాటు ఇబ్బంది పెట్టే రక్తపోటు, కీళ్లనొప్పులనూ దానిమ్మ పండ్లు తగ్గిస్తాయి
TV9 Telugu
దానిమ్మ శరీరానికి శక్తిని ఇస్తుంది. రక్త ప్రసరణ నుంచి గుండె ఆరోగ్యం వరకు ప్రతిదానికీ ఇది ఎంతో మేలు చేస్తుంది. దానిమ్మపండు యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, పోషకాలకు నిథి
TV9 Telugu
రోగనిరోధక శక్తిని పెంచడానికి, చర్మ కాంతిని మెరుగుపరచడానికి, పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి.. రోజూ గుప్పెడు దానిమ్మపండు విత్వనాలను తినాలని నిపుణులు సూచిస్తున్నారు
TV9 Telugu
దానిమ్మలోని పోషకాలు కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడం ద్వారా రక్తపోటును తగ్గిస్తుంది. ఇది ధమనుల్లో ఫలకం ఏర్పడకుండా నిరోధించడం ద్వారా గుండె ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది
TV9 Telugu
అలాగే ధమనుల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండానూ నిరోధించడంలో సహాయపడతాయి. పోషకాలతో నిండిన దానిమ్మను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల జీర్ణక్రియతో సహా మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది