మామిడి, ఆపిల్, సీతాఫలం, సపోటా, కమలా, బొప్పాయి... వంటి పండ్లను చాలామంది ఇష్టంగానే తింటుంటారు. కానీ వగరూ తీపీ కలగలిసిన రుచిలో ఉండే నేరేడు చాలా మందికి పెద్దగా ఇష్టం ఉండదు
TV9 Telugu
కొంతమందికైతే మహా ఇష్టం. మార్కెట్లో అవి కనిపించగానే క్షణం ఆలస్యం చేయకుండా కొనుక్కుంటారు. ఒక్కసారయినా తినాలనుకుంటారు. ఎందుకంటే ఈ సీజన్‌లో మాత్రమే వచ్చే నేరేడు ఎన్నో వ్యాధుల్ని అడ్డుకునే అద్భుత ఔషధఫలం...
TV9 Telugu
అందుకే పలుచని తొక్కతో త్వరగా చితికిపోయే నేరేడు పండ్లని సైతం ఎండుపండ్లగా నిల్వచేయడమే కాదు, వాటితో పొడీ చిప్సూ, ట్యాబ్లెట్లూ, చాక్లెట్లూ తయారుచేస్తూ ఏడాదిపొడవునా తినేలా చేస్తుంటారు
TV9 Telugu
అయితే నేరేడు పండ్లే కాదు విత్తనాలు కూడా ఆరోగ్యానికి భలేగా మేలు చేస్తాయి. వీటిల్లో శరీరానికి విటమిన్ సి, విటమిన్ ఎ, జాంబోలిన్, జాంబుసిన్, గాలిక్ ఆమ్లం, ఫ్లేవనాయిడ్లు, ఫైబర్, టానిన్లు, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి
TV9 Telugu
నేరేడు గింజలు పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. వీటిని తినడం డయాబెటిస్ రోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో జాంబోలిన్, జాంబుసిన్ అనే పోషకాలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర వేగంగా పెరగకుండా నిరోధిస్తాయి
TV9 Telugu
నేరేడు గింజలలో ఉండే ఫైబర్, చేదు గ్యాస్, అజీర్ణం, విరేచనాలు వంటి కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. అలాగే విరేచనాలకు కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది
TV9 Telugu
నేరేడు గింజలు శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. ఇది గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నేరేడు గింజలు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి
TV9 Telugu
ఇవి చర్మాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. చర్మాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి. నేరేడు గింజల పొడి జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఇది కేలరీలను త్వరగా బర్న్ చేయడంలో సహాయపడుతుంది. బరువును అదుపులో ఉంచుతుంది