చలికాలంలో బొప్పాయి తింటే ఏమవుతుందో తెలుసా?

08 December 2025

TV9 Telugu

TV9 Telugu

రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం... ఇది బొప్పాయితో లాభం. అయితే రోజులో ఎప్పుడైనా కాకుండా రోజుని బొప్పాయితోనే ప్రారంభిస్తే ఆరోగ్యానికి చాలా మేలంటున్నారు నిపుణులు

TV9 Telugu

విటమిన్‌ ఎ, బి, సి, ఇ, కాల్షియం, ఫైబర్‌, మెగ్నీషియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు... లాంటి పోషకాలెన్నో ఉంటాయి బొప్పాయిలో

TV9 Telugu

దీన్లో అధిక మోతాదులో ఫైబర్‌ ఉండటంవల్ల పరగడుపున తింటే మలబద్ధకాన్ని పోగొడుతుంది. అజీర్తిని తగ్గిస్తుంది. పీచు పదార్థంవల్ల త్వరగా ఆకలి వేయదు

TV9 Telugu

 క్యాలరీలూ తక్కువ. కాబట్టి బరువుని తగ్గిస్తుంది. ఉదయాన్నే తింటే శరీరంలోని మలినాల్ని బయటకు పంపి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది

TV9 Telugu

అంతేకాదు, దీన్లో పొటాషియం గుండె జబ్బుల్ని తగ్గిస్తే లైకోపీన్‌ చర్మానికి నిగారింపు తెస్తుంది. అందుకే రోజుని బొప్పాయితో మొదలుపెట్టండి. ముఖ్యంగా శీతాకాలంలో బొప్పాయి తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది

TV9 Telugu

బొప్పాయిలో పపైన్ ఎంజైమ్, ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు చలి నుంచి రక్షణ కల్పిస్తాయి. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం చల్లని వాతావరణంలో బొప్పాయి తినడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది

TV9 Telugu

బొప్పాయిలోని పపైన్ ఎంజైమ్, ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడతాయి. మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి

TV9 Telugu

బొప్పాయిలోని విటమిన్ ఎ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు చర్మాన్ని తేమగా ఉంచి ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇందులోని సహజ లక్షణాలు శరీరం నుంచి విషాన్ని తొలగించడంలో సహాయపడతాయి