వీరు మర్చిపోయి కూడా బొప్పాయి తినకూడదు.. ఎంత ప్రమాదమో తెలుసా?

19 January 2025

TV9 Telugu

TV9 Telugu

బొప్పాయి పేరు వింటేనే కొంతమంది మొహం తిప్పేస్తారు. కానీ ఈ పండు తింటే బోలెడన్ని లాభాలున్నాయి. అవేంటో వింటే ఈ పండును తినకుండా అస్సలుండలేం

TV9 Telugu

మీరు గమనించే ఉంటారు.. బొప్పాటి కాండం మీదనో కాయ మీదనో గాటుపెడితే పాలు కారుతుంటాయి. నిజానికి, బొప్పాయి మొక్క భాగాలన్నింట్లో ఉండే పపైన్‌ అనే ఎంజైమే దీనికి కారణం

TV9 Telugu

బొప్పాయిలో పపైన్‌ అనే ఎంజైమ్‌తోపాటు విటమిన్ ఎ, విటమిన్ సి, బి9, ఫైబర్‌, పొటాషియం మంచి మొత్తంలో ఉంటాయి. వీటితోపాటు కాల్షియం, మెగ్నీషియం, B1, B3, B5, విటమిన్ E, K కూడా పుష్కలంగా ఉంటుంది

TV9 Telugu

అందుకే బొప్పాయి సుగుణాల నిధి అని అంటారు. బొప్పాయి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. దీని వినియోగం కళ్ళకు ప్రయోజనకరంగా ఉంటుంది. జీవక్రియను కూడా ప్రభావితం చేస్తుంది

TV9 Telugu

బొప్పాయి తీసుకోవడం ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. అందువల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యల నుంచి రక్షించడంలో ఇది ప్రభావవంతంగా పని చేస్తుంది. ముఖ్యంగా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలున్నవారు బొప్పాయి ఖచ్చితంగా తినాలంటున్నారు ఆరోగ్య నిపుణులు

TV9 Telugu

బరువు తగ్గాలనుకునే వారు బొప్పాయిని ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాలి. ఈ పండు బరువు తగ్గడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మలబద్ధకంతో బాధపడేవారికి బొప్పాయి అద్భుతమైన పండు

TV9 Telugu

మలబద్ధకంతో బాధపడేవారు రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయిని తీసుకుంటే జీర్ణశక్తి పెరుగుతుంది. అయితే బొప్పాయిని గర్భధారణ సమయంలో తీసుకోకపోవడమే మంచిది

TV9 Telugu

అలాగే లూజ్ మోషన్ ఉన్నవారు కూడా బొప్పాయి తినకూడదు. మీకు చర్మ సంబంధిత సమస్యలు ఉంటే మాత్రం బొప్పాయి తప్పక తినాలి. ఎందుకంటే, బొప్పాయి చర్మ సమస్యలకు అద్భుతమైన వైద్యం చేస్తుంది