ప్యాక్‌ చేసిన కొబ్బరి నీళ్లు మీరూ తాగుతున్నారా?

20 May 2025

TV9 Telugu

TV9 Telugu

వేసవిలో వడదెబ్బ నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది కొబ్బరి నీళ్లు, శీతల పానియాలు తాగుతుంటారు. ఇవి వేసవిలో శరీరాన్ని చల్లగా, హైడ్రేటెడ్‌గా ఉంచడానికి సహాయపడతాయి

TV9 Telugu

వేసవిలో వడదెబ్బ సాధారణ సమస్య. కానీ కొన్నిసార్లు ఇది తీవ్రమైన సమస్యగా మారుతుంది. కాబట్టి వేసవిలో దీని నుంచి బయటపడటానికి కొబ్బరి నీళ్లు తాగడం మంచిది

TV9 Telugu

కొబ్బరి నీళ్లు తాగడం వల్ల తక్షణ శక్తి పెరుగుతుంది. ఎముకలను బలోపేతం చేయడమే కాకుండా ఇది జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. కాలేయం, గుండె, మూత్రపిండాలకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది

TV9 Telugu

ఎందుకంటే ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది. కొబ్బరి నీళ్లు తాగడానికి ఉత్తమ మార్గం ఉదయం పరగడుపున తాగడం. అయితే దీనికి ఏమీ జోడించకుండా నేరుగా తాగాలి

TV9 Telugu

వేసవిలో నిమ్మరసం, చియా విత్తనాలను కూడా దీనికి జోడించి తాగవచ్చు. కొబ్బరి నీళ్లుకొబ్బరి నీరు ఒక సహజ ఎలక్ట్రోలైట్. ఇందులో విటమిన్ సి, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి పలు ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి

TV9 Telugu

అయితే నేటి కాలంలో ప్యాక్ చేసిన కొబ్బరి నీళ్లు మార్కెట్లో లభిస్తున్నాయి. ఇవి ఎంతో ఆరోగ్యకరమైనవని ప్రకటనలు సైతం చేస్తుంటారు. వీటిని నిజమని నమ్మిన జనాలు కొనుగోలు చేసి తాగుతుంటారు

TV9 Telugu

కానీ ఇలా ప్యాక్ చేసిన కొబ్బరి నీళ్లు తాగడం అంత మంచిది కాదు. ఎందుకంటే ప్యాక్ చేసిన కొబ్బరి నీళ్లలో చక్కెర ఉండవచ్చు. లాభాలకు కక్కుర్తిపడి వ్యాపారులు ఇలా నకిలీ కొబ్బరి నీళ్లు అమ్ముతుంటారు

TV9 Telugu

అదే తాజా కొబ్బరి నీళ్లు తాగడం ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. కొబ్బరి నీళ్లు కొని వెంటనే త్రాగవచ్చు. అయితే రోజుకి ఒకటి లేదా రెండు కప్పులకు మించి ఎక్కువ కొబ్బరి నీళ్లు తాగకపోవడమే మంచిది