ఎలాంటి రోగాన్నైనా తట్టుకుని ఆరోగ్యంగా ఉండాలంటే ప్రకృతి ప్రసాదించిన కొన్ని రకాల ఔషధాల్ని ఆహారంలో భాగంగా చేసుకోకతప్పదు. అలాంటివాటిల్లో ఒకటి పసుపు...
TV9 Telugu
ప్రపంచమంతా మంత్రంలా జపిస్తోన్న ఆ ఔషధ వేరులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. జలుబు చేసినా జ్వరంగా ఉన్నా దగ్గుతున్నా కాస్త పసుపు కలిపిన గోరువెచ్చని పాలు తాగితే సరి
TV9 Telugu
అలాగే వంటల్లో కాస్తింత పసుపు వేస్తేచాలు మంచి రంగుతోపాటు వంటలు ఘుమఘుమలాడిపోతాయి. ముఖ్యంగా పచ్చి పసుపు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది
TV9 Telugu
రుబ్బిన పచ్చి పసుపు ముద్ద చలికాలంలో మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. నిజానికి, పచ్చి పసుపు చూసేందుకు అల్లంలా ఉంటుంది
TV9 Telugu
దానిలో చిన్న ముక్కను రుబ్బి పేస్ట్‌లా చేసుకోవాలి. దీనిని నీళ్లలో వేసి, అందులో కాస్త అల్లం ముక్క జోడించి బాగా మరిగించి టీ మాదిరి తాగాలి. ఈ టర్మరిక్ టీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది
TV9 Telugu
పసుపు కలిపిన పాలు శీతాకాలంలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి. పచ్చి పసుపును పాలలో వేసి మరిగించి తాగిలి. చలికాలంలో ఈ పసుపు పాలు చాలా మేలు చేస్తాయి
TV9 Telugu
అలాగే శీతాకాలంలో, పసుపు చట్నీని తయారు చేసి తినవచ్చు. ఇది రుచిగా ఉండటంతోపాటు అనేక పోషకాలు,యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో నిండి ఉంటుంది
TV9 Telugu
చలికాలంలో కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందాలంటే పచ్చి పసుపును గ్రైండ్ చేసి, ఆవాల నూనెలో వేసి కీళ్లపై రాసుకుంటే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే పచ్చి పసుపు, బెల్లం, వెల్లుల్లి కలిపి కషాయం చేసి కొద్దిగా గోరువెచ్చని నీటితో కలిపి తీసుకుంటే కఫం తగ్గుతుంది