పచ్చి బొప్పాయి ఎవరు తినకూడదో తెలుసా?

Samatha

19 september 2026

Pic credit - Pinterest

పచ్చి బొప్పాయి ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే చాలా మంది దీనిని తింటుంటారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్,పోషకాలు ఎక్కువగా ఉంటాయి.

పచ్చి బొప్పాయి

అయితే, పచ్చి బొప్పాయి ఆరోగ్యానికి చాలా మంచిదే అయినప్పటికీ కొంత మంది దీనికి ఎంత దూరం ఉంటే అంత మంచిదంట. అది ఏదో చూద్దాం.

తినకూడని వారు

పచ్చి బొప్పాయి ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ గర్భిణీ స్త్రీలు అస్సలే దీనిని తినకూడదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. దీని వలన గర్భసంచి ముడుచుకుపోతుందంట.

గర్భిణీలు

అలాగే బాలింతలు కూడా పచ్చి బొప్పాయి అస్సలే తినకూడదంట. దీని వలన పాలు విరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందంట. అందువలన ఎంత తినకపోతే అంత మంచిది.

బాలింతలు

హైపోథైరాయిడ్ ఉన్నవాళ్లు కూడా అస్సలే పచ్చి బొప్పాయి తీసుకోకూడదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది హార్మోన్ పనితీరును దెబ్బతీస్తుందంట.

హైపో థైరాయిడ్

అలాగే అలర్జీ ఉన్నవారు  కూడా వీలైనంత వరకు బొప్పాయి తినకపోవడమే ఆరోగ్యానికి చాలా మంచిదని హెచ్చరిస్తున్నారు వైద్యనిపుణులు.

అలర్జీ ఉన్నవారు

పచ్చి బొప్పాయిలో  కాల్షియం ఆక్సలేట్ ఎక్కువగా ఉంటాయి. అందువలన కిడ్నీ స్టోన్స్ సమస్యతో బాధపడే వారు అస్సలే తీసుకోకూడదంట.

కిడ్నీ సమస్యలు ఉన్నవారు

షుగర్ బాగా తక్కువ ఉన్నవాళ్లు , గుండె లయ తక్కువగా ఉన్నవాళ్లు కూడా వీలైనంత వరకు పచ్చి బొప్పాయి తినకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు.

షుగర్, గుండె లయ తక్కువ ఉన్నవారు