వీటిని గుర్తుపట్టారా? పాప్‌కార్న్ అనుకునేరు.. భలే ఉంటుందిలే!
02 June 2025
TV9 Telugu
TV9 Telugu
మఖానాగా పిలిచే తామర గింజల్లో బోలెడన్ని పోషకాలు నిండి ఉంటాయి. ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే ఈ గింజలు ఆరోగ్యానికెంతో మేలు
TV9 Telugu
అయితే వీటిని కొందరు పచ్చిగానే తీసుకుంటే.. మరికొందరు వేయించుకొని, ఉడకబెట్టుకొని, కూరల్లో, స్వీట్లలో భాగం చేసుకుంటారు. ఎలా తీసుకున్నా.. తామర గింజలతో ఆరోగ్యానికి ఎంతో మంచిది
TV9 Telugu
మఖానాలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. మఖానాలో తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ ఉంటుందని. దీంతో ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది
TV9 Telugu
మఖానా కాల్షియం, భాస్వరంకు మంచి మూలం. ఇది ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది
TV9 Telugu
మఖానాలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు కూడా అధిక మొత్తంలో ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది
TV9 Telugu
మఖానాలో ఉండే విటమిన్ సి, యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో భలేగా ఉపయోగపడతాయి
TV9 Telugu
మఖాన శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. కాబట్టి మీరు రోజంతా చురుకుగా ఉండగలరు. మఖానాలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరిచే న్యూరోట్రాన్స్మిటర్ అయిన సెరోటోనిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది
TV9 Telugu
ఈ తామర గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి వివిధ ఆరోగ్య సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి