నెల రోజులపాటు ఉసిరి జ్యూస్ తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
27 February 2025
TV9 Telugu
TV9 Telugu
వేసవి కాలంలో ఉసిరికాయలు పుష్కలంగా దొరుకుతాయి. అయితే, దీన్ని ఏ రూపంలో తిన్నా...ప్రయోజనాలు మాత్రం అపారం అంటారు పోషకాహార నిపుణులు
TV9 Telugu
రోగనిరోధకశక్తి పెంచడానికి ఉసిరి బలేగా ఉపయోగపడుతుంది. ఉసిరిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు.. చర్మంలో కొలాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మం కాంతిమంతంగా కనిపించేట్టు చేస్తాయి
TV9 Telugu
ఉసిరి మన మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. అదే ఉసిరి రసం తాగడం వల్ల శరీరంలోని మలినాలను శుభ్రపరుస్తుందని నిపుణులు అంటున్నారు
TV9 Telugu
ఉసిరి రసం తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. ఇది డయాబెటిస్ రోగులకు చాలా ప్రయోజనకరమైన విషయం
TV9 Telugu
ఉసిరి తినడం వల్ల చర్మానికి మెరుపు వస్తుంది. ముఖంపై నల్లటి మచ్చలు తగ్గుతాయి. 1 నెల పాటు ఉసిరి రసం తాగితే, చర్మం ఆరోగ్యంగా మారుతుంది
TV9 Telugu
ఈ అలవాటు గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సహాయపడతాయి. రోజూ ఉసిరి తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి గుండెకు మేలు చేస్తాయి
TV9 Telugu
ఉసిరి తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. 30 రోజులు వరుసగా తింటే మీ కంటి చూపు మెరుగుపడుతుంది. ఉసిరి తినడం వల్ల ఆస్టియోపోరోసిస్, ఆర్థరైటిస్, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది
TV9 Telugu
ఉసిరి తినడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. జలుబు, దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తుంది