పోషకాలు పోకుండా ఉండాలంటే.. కొన్ని రకాల కూరగాయలు వండే విషయంలో.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు
TV9 Telugu
మనం ఎక్కువగా వండుకునే కూరగాయల్లో బంగాళాదుంపలు ఒకటి. బంగాళాదుంపల్ని మరీ చిన్న చిన్న ముక్కలుగా కోసి ఉడికించకూడదు
TV9 Telugu
అలా చేస్తే వాటిలోని పోషక విలువలు పోతాయి. అందుకే బంగాళాదుంపల్ని బాగా కడిగి మధ్యలో చిన్నగా కోసి పొట్టుతో ఉడికించాలి
TV9 Telugu
అలా చేయడం వల్ల దుంపల పొట్టులో ఉండే పీచు పోదు. ఇతర పోషకాలూ అందుతాయని చెబుతున్నారు నిపుణులు. ఇక బంగాళాదుంపల ఉడికించడంతో ఇంకొన్ని తప్పులు ఉన్నాయి
TV9 Telugu
ఆవిరి మీదనా? మైక్రోవేవ్‌లోనా? చెక్కు తీసేసా? తీయ కుండానా? ఎలా ఉడికిస్తేనేం అని అనుకోకండి. వండే తీరును బట్టి పోషకాల మోతాదులు ఆధారపడి ఉంటున్నాయి
TV9 Telugu
చెక్కుతీసిన బంగాళాదుంపలతో పోలిస్తే- చెక్కుతీయకుండా ఉడికించిన వాటిల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది
TV9 Telugu
చెక్కుతీసిన బంగాళాదుంపల్లో కన్నా చెక్కు తీయకుండా ఆవిరి మీద ఉడికించినవాటిల్లో 8 రెట్లు, మైక్రోవేవ్ ఓవెన్‌లో ఉడికించినవాటిల్లో 12 రెట్లు అధికంగా విటమిన్ సి ఉంటుంది
TV9 Telugu
బంగాళా దుంపల లోపల పసుపురంగున్నవి.. ఊదా రంగు, ఎరుపు రంగు బంగాళాదుంపల్లో యాంటీఆక్సిడెంట్లు పెద్దమొత్తంలో ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి మంచివే