రకరకాల వర్ణాలు, ఆకృతుల్లో... పెద్ద పెద్ద పూలతో నిండుగా విరబూస్తుంది. నేలలోనే కాదు కుండీల్లోనూ చక్కగా విరబూస్తుంది. ఈ మొక్క ఉష్ణ, సమశీతోష్ణ మండల వాతావరణంలో సులువుగా ఎదుగుతుంది
TV9 Telugu
మందారాన్నే దీన్ని చైనీస్ రోజ్ అని కూడా అంటారు. దీని శాస్త్రీయ నామం... హైబిస్కస్ రోజాసైనేన్సిస్. ఇది ఎరుపు, పసుపు, తెలుపు, కాషాయం, గులాబీ... ఇలా బోలెడు రంగులు, వివిధ ఆకృతుల్లో చెట్టు నిండా పూలతో కనువిందు చేస్తుంది
TV9 Telugu
మందార పువ్వులోఅనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. అందుకే వీటిని సాంప్రదాయ ఔషధ తయారీలో ఉపయోస్తారట
TV9 Telugu
మందార పువ్వులతో చేసిన టీ ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. రోజూ దీన్ని తీసుకుంటే అనేక విధాలుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది
TV9 Telugu
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మందార పూల టీ రక్తపోటును తగ్గిస్తుంది. ఇది రక్తపోటును తగ్గించే మందులకు సమానమైన శక్తిని కలిగి ఉంటుందని చెబుతున్నారు
TV9 Telugu
మందార పువ్వుల టీ గుండెను బలోపేతం చేయడానికి, గుండె సంబంధిత వ్యాధులను నివారించడానికి సహాయపడుతుంది
TV9 Telugu
మందార పూల టీ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఈ టీ తాగడం వల్ల అధిక కొలెస్ట్రాల్‌కు కారణమయ్యే LDL తగ్గుతుంది
TV9 Telugu
అలాగే మందార పువ్వుల టీని క్రమం తప్పకుండా తాగడం వల్ల ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. కాబట్టి ఆరోగ్యాంగా ఉండాలంటే మందార పువ్వు టీని రోజూ తీసుకోవడం మీరూ అలవాటు చేసుకోండి