వెలగపండుని ఆంగ్లంలో ఉడ్‌యాపిల్ అంటారు. పోషకాలకు ఈ పండు పెట్టింది పేరు. ప్రతి 100గ్రా పండు నుంచి 518 కెలొరీల శక్తి అందుతుంది. రైబోఫ్లేవిన్, నియాసిన్, విటమిన్ సిలను పుష్కలంగా అందించే పండు ఇది
పేగుల్లో వాపుని, నోటిపూతను తగ్గిస్తుంది. సంవత్సరానికి ఒక్కసారైనా తినాల్సిన ఆహారం ఇది. వెలగపండుతో జ్యూస్ కూడా తయారు చేసి తాగవచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది
TV9 Telugu
వెలగపండులో విటమిన్ సి, కాల్షియం, భాస్వరం, ఫైబర్, ప్రోటీన్, ఐరన్, టానిన్, రిబోఫ్లేవిన్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి
TV9 Telugu
ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొంతమంది వెలగపండు జ్యూస్ తాగకూడదని పోషకాహార నిపుణులు అంటున్నారు
TV9 Telugu
డయాబెటీస్‌తో పోరాడేవారు పొరపాటున కూడా వెలగపండు జ్యూస్ అస్సలు తాగకూడదు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతుంది
TV9 Telugu
అలాగే జీర్ణ సమస్యలు ఉన్నవారు కూడా వెలగపండు జ్యూస్ తీసుకోవడం మానుకోవాలి. ఇది కడుపు నొప్పికి కారణమవుతుంది
TV9 Telugu
ఇందులో అధిక మొత్తంలో కాల్షియం, భాస్వరం ఉంటాయి. ఇది మూత్రపిండాల సమస్యలకు మరింత హానికరం. కిడ్నీలో రాళ్ళు సమస్య ఉన్నవారు పొరబాటున కూడా దీనిని తీసుకోకూడదు