ఆవాలు వీరికి విషంతో సమానం.. తిన్నారో టికెట్ కన్ఫార్మ్ అయినట్లే
08 December 2024
TV9 Telugu
TV9 Telugu
తాలింపులో వేసే అర చెంచా ఆవాలు కూర, చారుల రుచిని అమాంతం పెంచేస్తాయి. ఆవాల పొడి వేయడం వల్లే ఊరగాయ పచ్చళ్లు గొప్పగా ఘుమాయిస్తాయి. ఇలా మన ప్రాంతాల్లో ఆవాలను ఎక్కువగానే ఉపయోగిస్తాం
TV9 Telugu
ఆవాలతోపాటు ఆవాకు తినే అలవాటు మన తెలుగు వారికి పెద్దగా లేదు. నిజానికి ఇది చాలా మంచిదంటున్నారు ఆహార నిపుణులు. పాలకూర, మెంతికూరల్లా ఆవాకు కూడా శ్రేష్ఠమైందని, వీలైనప్పుడల్లా ఏదో ఒక రూపంలో తినేందుకు ప్రయత్నించమని చెబుతున్నారు
TV9 Telugu
ఆవాకును కంది, పెసర, శనగ పప్పులతో కలిపి వండొచ్చు. దీన్ని ఆలివ్ నూనెలో వేయించి.. కారం, ఉప్పు, వెల్లుల్లి, నిమ్మరసం వేస్తే సైడ్ డిష్ అయిపోతుంది. సలాడ్ రూపంలో అయితే పిల్లలూ పెద్దలూ అందరికీ నచ్చేస్తుంది
TV9 Telugu
ఆవాకు రుచిగా ఉండటమే కాకుండా, పోషకాల నిధి కూడా. ఆవాకులో రోజువారీ విటమిన్ సి 44%, విటమిన్ ఇ 8%, విటమిన్ కె 120%, విటమిన్ ఎ 9%, విటమిన్ బి6 6% ఉంటాయి
TV9 Telugu
అంతేకాకుండా ఇందులో రాగి, ఫైబర్, ప్రోటీన్, సహా అనేక పోషకాలు ఉన్నాయి. ఆవాకు శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడం, ఆరోగ్యకరమైన గుండె, మంచి కంటి, చర్మ ఆరోగ్యం వంటి ప్రయోజనాలు అందిస్తుంది
TV9 Telugu
రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులను తరిమికొట్టే యాంటీఆక్సిడెంట్స్ ఆవాకులో విస్తారంగా ఉన్నాయి. ఇది టైప్-2 డయాబెటిస్, గుండెజబ్బులను నిరోధిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. రక్తం గడ్డకుండా చేస్తుంది. ఎముకలు, దంతాలను దృఢంగా ఉంచుతుంది
TV9 Telugu
ఎసిడిటీ, పొట్టలో గ్యాస్‌తో సహా జీర్ణక్రియ సమస్యలు ఉన్నవారు మాత్రం ఆవాకుకు దూరంగా ఉండటం మంచిది. అలాగే అధిక యూరిక్ యాసిడ్ ఉన్నవారు, కీళ్లనొప్పులు ఉన్నవారు కూడా ఆవాలు, ఆవాకు తినడం మానుకోవాలి
TV9 Telugu
కిడ్నీలో రాళ్లు లేదా కిడ్నీకి సంబంధించిన మరేదైనా సమస్య ఉన్నవారు ఆవాలు తినడం మానేయాలి. ఎందుకంటే ప్యూరిన్‌లతో పాటు ఇందులో ఆక్సలేట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవి మూత్రపిండాల సమస్యను మరింత తీవ్రం చేస్తాయి