గుడ్లు ఆరోగ్యానికి మంచివే.. కానీ వీరికి కాలకూట విషంతో సమానం!

11 July 2025

TV9 Telugu

TV9 Telugu

గుడ్లు ఎన్నో పోషకాలు కలిగిన ఆహారం. ఎ, డి, ఇ, కె, బి తదితర విటమిన్లు గుడ్డులో లభిస్తాయి. సమతుల ఆహారం తీసుకోవాలనుకునేవారు తప్పకుండా గుడ్డును తినాలని నిపుణులు చెబుతున్నారు

TV9 Telugu

ముఖ్యంగా శరీరానికి కావాల్సిన మంచి కొవ్వును గుడ్లు అందిస్తాయని పలు పరిశోధనలు తెలియజెబుతున్నాయి. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి, ముందుగా కనిపించే వృద్ధాప్య ఛాయలను నిరోధించడానికి గుడ్లు తోడ్పడతాయి

TV9 Telugu

గుడ్లు ప్రోటీన్లు అధికంగా ఉండే, పోషకాలు కలిగిన ఆహారం. ఇది దాదాపు అన్ని వయసుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే వైద్యులు కూడా రోజుకో గుడ్డు తినమని సిఫార్సు చేస్తుంటారు

TV9 Telugu

అయితే గుడ్లు అందరికీ మేలు చేయవు. కొంతమందికి గుడ్డు తింటే మేలుకి బదులు హాని అధికంగా కలుగుతుంది. ముఖ్యంగా గుడ్డు పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది

TV9 Telugu

గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటుతో బాధపడేవారు ఎక్కువ గుడ్లు తినడం వల్ల రక్తంలో LDL (చెడు కొలెస్ట్రాల్) పెరుగుతుంది. వీరు గుడ్డు సాధ్యమైనంత తక్కువగా తినడం మంచిది

TV9 Telugu

టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు గుడ్డు తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. వీరు మితంగా తీసుకుంటే బెటర్‌. అలాగే కాలేయం,మూత్రపిండాల సమస్యలు ఉన్నవారికి కూడా గుడ్డు అంత మంచిది కాదు. వీరు ఎక్కువ గుడ్లు తినడం వల్ల ఒంట్లో యూరియా, క్రియాటినిన్ పెరుగుతుంది

TV9 Telugu

గుడ్డు అలెర్జీ ప్రధానంగా పిల్లలలో కనిపిస్తుంది. ఒక్కోసారి పెద్దలు కూడా దీని బారిన పడవచ్చు. గుడ్డులోని తెల్లసొనలోని ఓవల్‌బ్యూమిన్, ఓవోముకోయిడ్ మొదలైన ప్రోటీన్లు అలెర్జీకి కారణమవుతాయి. వీరు గుడ్డు ముట్టుకోకపోవడమే మంచిది

TV9 Telugu

దురద, దద్దుర్లు, వాంతులు, కడుపు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కొన్నిసార్లు అనాఫిలాక్సిస్ ప్రాణాంతకం కావచ్చు. ఈ లక్షణాలు ఉన్నవారు గుడ్డు మర్చిపోయి కూడా తీసుకోకూడదు. గుడ్లు సూపర్ ఫుడ్ అయినప్పటికీ కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఇది విషంగా మారి హానితలపెడుతుంది