వీరికి సారకాయ యమ డేంజర్.. ముట్టుకోకపోవడమే బెటర్!
07 July 2025
TV9 Telugu
TV9 Telugu
తేలిగ్గా అరగడమే కాకుండా, వివిధ పోషకాలను అందిస్తూ... శరీర తాపాన్ని తగ్గించడంలో సొరకాయని మించింది లేదంటారు పోషకాహార నిపుణులు
TV9 Telugu
సొరకాయలో క్యాలరీలు చాలా తక్కువ. వంద గ్రాముల కాయ నుంచి శరీరానికి అందేవి 15 క్యాలరీలే. నీరు మాత్రం 96 శాతం ఉంటుంది
TV9 Telugu
వీటిల్లో జీర్ణశక్తికి సహకరించే పీచు పుష్కలంగా దొరుకుతుంది. ఇది అతిగా తినే అలవాటుని తగ్గిస్తుంది. శరీర బరువుని అదుపులో ఉంచుతుంది
TV9 Telugu
శరీరంలోని నీరు చెమట రూపంలో బయటకు పోతే, నీటి నిల్వలు తగ్గి నిస్సత్తువ ఆవరిస్తుంది. ఈ పరిస్థితి తలెత్తకూడదంటే... సొరకాయని తరచూ తింటే మేలు. ఇది అతి దాహం తగ్గిస్తుంది
TV9 Telugu
శరీరానికి హాని చేసే కొవ్వు ఇందులో ఉండదు. వ్యాధి నిరోధక శక్తిని పెంచే విటమిన్ సి, రైబోఫ్లేవిన్, జింక్, థయమిన్, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి
TV9 Telugu
సొరకాయతో ఎన్ని ప్రయోజనాలు ఉన్ననప్పటికీ కొంత మందికి ఇది ఆరోగ్య ప్రయోజనాలకు బదులు డేంజర్‌గా మారుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు
TV9 Telugu
గ్యాస్, అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యలు ఉన్నవారు ఈ కూరగాయను తినకుండా ఉండటం మంచిది. అలాగే ఇప్పటికే తక్కువ రక్తపోటు సమస్యలతో బాధపడుతున్నవారికి కూడా సొరకాయ అంత మంచిది కాదు
TV9 Telugu
అలాగే మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడేవారికి సొరకాయ అంత మంచిది కాదు. గర్భధారణ సమయంలో సొరకాయను పచ్చిగా తినకూడదు. అలెర్జీలు ఉన్నవారు సొరకాయ తింటే చర్మంపై చికాకు, దద్దుర్లు,వాపు వంటి సమస్యలు తలెత్తుతాయి