మెంతి గింజల నీళ్లు వీరికి యమ డేంజర్.. ముట్టుకోకపోవడమే బెటర్!
07 May 2025
TV9 Telugu
TV9 Telugu
చూడ్డానికి చిన్నగా ఉన్నా, మెంతులతో ఆరోగ్యానికి చాలా లాభమని చెబుతున్నాయి పరిశోధనలు. ముఖ్యంగా నానబెట్టుకుని తీసుకుంటే ఫలితాలు అధికంగా ఉంటాయట
TV9 Telugu
నానబెట్టిన మెంతుల్ని ఉదయాన్నే తీసుకుంటే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. వీటిల్లోని పీచు పొట్ట ఆరోగ్యానికి మేలు చేసే బ్యాక్టీరియా పెరగడానికి సాయపడుతుంది
TV9 Telugu
మెంతి గింజలను సాధారణంగా ఇంట్లో మసాలాగా ఉపయోగిస్తుంటారు. లేదంటే ఊరగాయలలో కలుపుతారు. కొంతమంది ఆరోగ్యానికి మంచిదికదాని మెంతి గింజల నీటిని కూడా తాగుతుంటారు
TV9 Telugu
మెంతి గింజల నీరు తాగడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.. ఇలా శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి
TV9 Telugu
కానీ ఇది కొంతమందికి హాని కలిగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా డయాబెటిస్‌తో బాధపడేవారు మెంతి గింజల నీరు తాగితే ఉన్నట్లుండి రక్తంలో చక్కెర స్థాయి పడిపోతే ప్రమాదం ఉంది
TV9 Telugu
అలాగే గర్భధారణ సమయంలోనూ మహిళలు పొరపాటున కూడా మెంతి గింజల నీటిని తాగకూడదు. ఈ సమయంలో హార్మోన్ల మార్పులు జరుగుతుంటాయి. మెంతి గింజలు సహజంగానే వేడి స్వభావం కలిగి ఉంటాయి. ఇవి హాని కలిగించే ప్రమాదం ఉంది
TV9 Telugu
అలాగే ఏదైనా రక్తస్రావం రుగ్మత ఉన్నవారు కూడా మెంతి గింజల నీటిని తాగకుండా ఉండాలి. లేకుంటే పరిస్థితి మరింత తీవ్రంగా మారే ప్రమాదం ఉంది. డయాబెటిస్ ఉన్నవారు, రక్తపోటు ఉన్నవారేకాదు ఏదైనా దీర్ఘ కాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు కూడా మెంతి గింజల నీరు తాగకూడదు
TV9 Telugu
మెంతి గింజల నీరు కొంతమందిలో చర్మంపై దద్దుర్లు, అజీర్ణం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి అలెర్జీలను కలిగిస్తుంది. మీకు ఏదైనా అలెర్జీ ఉంటే మెంతి గింజల నీరు తాగకపోవడమే మంచిది