పచ్చి బొప్పాయి వీరికి విషంతో సమానం.. పొరబాటున తిన్నారో కథ కంచికే!

23 May 2025

TV9 Telugu

TV9 Telugu

బొప్పాయి పండులో బోలెడన్ని విటమిన్లు ఉంటాయ్‌. ముఖ్యంగా విటమిన్‌ ఎ ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే పపైన్‌ అనే ఎంజైమ్‌ జీర్ణక్రియ సాఫీగా జరగడానికి ఉపయోగపడుతుంది. అలాగే కెరోటినాయిడ్లూ, పీచు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి

TV9 Telugu

కొంత పచ్చి బొప్పాయిని కూడా తీసుకుంటారు. నిజానికిది సూపర్ ఫుడ్ లాంటిది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బరువు తగ్గడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది

TV9 Telugu

కానీ ఎన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొందరికి ఇది అస్సలు మంచిది కాదు. పచ్చి బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ కొంతమందికి హానికరంగా మారుతుంది. అందువల్ల ఏ వ్యక్తులు దీనికి దూరంగా ఉండాలో ఇక్కడ తెలుసుకుందాం..

TV9 Telugu

ముఖ్యంగా గర్భధారణ సమయంలో మహిళలు తమ ఆహారం, పానీయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కొన్ని ఆహారాలు అత్యంత ప్రమాదకరమైనవి. వాటిలో ఒకటి పచ్చి బొప్పాయి. దీన్ని తీసుకోవడం వల్ల గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంది

TV9 Telugu

అయితే పండిన బొప్పాయి తినడం సురక్షితమే. కానీ పచ్చి బొప్పాయి అలాకాదు. ఇది హార్మోన్ల సమతుల్యతకు ప్రభావితం చేస్తుంది. పాల ఉత్పత్తిలో అసమతుల్యతకు కారణమవుతుంది. దీనిలో ఉండే లేటెక్స్ మూలకం కూడా పిల్లలకు అలెర్జీని కలిగిస్తుంది

TV9 Telugu

లేటెక్స్ లేదా పపైన్ అలెర్జీ ఉన్నవారు పచ్చి బొప్పాయిని అస్సలు తినకూడదు. ఈ అలెర్జీలు చర్మంపై దద్దుర్లు, దురద, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలను కలిగిస్తాయి

TV9 Telugu

పచ్చి బొప్పాయి శరీరంలోని కొన్ని ఎంజైమ్‌లను సక్రియం చేస్తుంది. ఇవి రక్తాన్ని పలుచగా చేస్తాయి. ఇది శస్త్రచికిత్స తర్వాత రక్తస్రావం ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది కోలుకునే దశలో ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది

TV9 Telugu

పచ్చి బొప్పాయి శరీరంలోని రక్త నాళాలను సడలించడం వల్ల రక్తపోటును మరింత తగ్గిస్తుంది. దీన్ని తింటే తక్కువ రక్తపోటు ఉన్నవారు తలతిరగడం, బలహీనత, మూర్ఛపోవడం వంటి సమస్యల భారీన పడతారు