అలాగే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా చూస్తాయి. నారింజ పండ్లను తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది
TV9 Telugu
అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్దకం నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే నారింజ పండ్లే కాదు వీటి తొక్క కూడా మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది
TV9 Telugu
చాలా మంది నారింజ పండు తిన్న తర్వాత తొక్కను పారేస్తారు. ఇలా చేయడానికి బదులుగా దానితో ఫేస్ మాస్క్ తయారు చేసుకుంటే మీ అందం రెట్టింపవుతుంది
TV9 Telugu
నారింజ ఫేస్ మాస్క్ తయారు చేయడానికి ముందుగా ముందుగా నారింజ తొక్కను ఎండలో ఆరబెట్టి.. ఆ తర్వాత మెత్తగా పొడి చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో 2-3 చెంచాల నారింజ తొక్క పొడి తీసుకుని అందులో తేనె లేదా పుల్లని పెరుగు కలుపుకోవాలి
TV9 Telugu
అనంతరం ఈ నారింజ తొక్క మిశ్రమాన్ని ముఖం, మెడపై అప్లై చేసి చేతులతో సున్నితంగా మసాజ్ చేయాలి. అనంతరం 20-30 నిమిషాలు అలాగే ఉంచాలి
TV9 Telugu
తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ముఖానికి నారింజ తొక్కల మాస్క్ అప్లై చేయడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది
TV9 Telugu
మొటిమలు, నల్లటి మచ్చలు తగ్గుతాయి. మృత కణాలు ఈ ఫేస్ మాస్క్‌ను వారానికి 1-2 సార్లు ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది